Begin typing your search above and press return to search.

NOLAN లోతులను త‌వ్వ‌డానికి 100ఏళ్లు చాల‌వు: ఆర్జీవీ

గత మూడు రోజులు గా వరుస ట్వీట్లలో రామ్ గోపాల్ వర్మ ఓపెన్ హైమ‌ర్ సినిమాను.. నోల‌న్ ను ప్రశంసించకుండా ఆగ‌లేకపోయారు.

By:  Tupaki Desk   |   24 July 2023 4:29 PM GMT
NOLAN లోతులను త‌వ్వ‌డానికి 100ఏళ్లు చాల‌వు: ఆర్జీవీ
X

అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కిన ఓపెన్‌హైమర్ జూలై 21న థియేటర్‌ల లో విడుదలైన సంగ‌తి తెలిసిందే. ఇంటర్‌స్టెల్లార్-ఇన్‌సెప్షన్ వంటి కొన్ని బిగ్గెస్ట్ మైండ్ బెండింగ్ బ్లాక్‌బస్టర్‌ల ను తెర‌కెక్కించిన క్రిస్టోఫర్ నోలన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రేక్ష‌కులు స‌హా విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను ద‌క్కించుకుంది. కేవ‌లం తొలి 3రోజుల్లోనే భార‌త‌దేశంలో 50 కోట్లు వ‌సూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా చాలామంది సినీప్ర‌ముఖులు స‌హా ఫ్యాన్స్ కి గొప్ప‌గా న‌చ్చింది. వారంతా సోష‌ల్ మీడియాల్లో అద్భుత‌మైన స‌మీక్ష‌లు ఇచ్చారు.

గత మూడు రోజులు గా వరుస ట్వీట్లలో రామ్ గోపాల్ వర్మ ఓపెన్ హైమ‌ర్ సినిమా ను.. నోల‌న్ ను ప్రశంసించకుండా ఆగ‌లేకపోయారు. ఓపెన్ హైమర్‌ ను 'సినిమాటిక్ బాంబ్' అని పొగిడేసిన ఆర్జీవీ.. నోలన్ నడుపుతున్న పాఠశాల లో తిరిగి చదువుకోవాల ని కోరుకుంటున్నట్లు తెలిపారు. జూలై 21 శుక్రవారం సినిమా చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ, "#Oppenheimer సినిమా నుండి ఇప్పుడే బయట కు వచ్చాను. MASTERPIECE అనేది చాలా చిన్న పదం. NOLAN పాత్ర లోతుల ను అర్థం చేసుకోవడానికి మ‌న‌కు వంద సంవత్సరాలు పడుతుంది. ఇది బాంబు కాదు.. ఇది భావోద్వేగాల విస్ఫోటనం! అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. తర్వాత రోజు మ‌రో ట్వీట్ లో #ఓపెన్‌హైమర్ బాంబ్ గురించి కాదు కానీ బాంబ్ వెనుక ఉన్న రాజకీయాల గురించిన సినిమా అని కూడా రాశారు.

జూలై 23 ఆదివారం నాడు వర్మ ట్వీట్ల‌ను కంటిన్యూ చేసారు. ఓపెన్ హైమర్‌ ని సినిమాగా భావించడం చాలా పెద్ద తప్పు. నిజానికి నాకు పునర్జన్మను కలిగించింది. నా మైండ్ స్పేస్‌లో నన్ను కొత్త హోరిజోన్‌ లోకి నెట్టివేసింది. నేను చేసిన ప్రతి పని చాలా అనవసరంగా నిస్సత్తువగా ఉంది. నేను తిరిగి కంబ్యాక్ అవ్వాల‌ని భావిస్తున్నాను. నా భావోద్వేగాల ను తిరిగి చదవడం కోసం ప్ర‌య‌త్నిస్తాను. మానవ దుర్బలత్వం తాలూకా విస్ఫోటనం #Oppenheimer ఒక సినిమా కాదు... ఇది ఒక మ‌నిషి.. అంటూ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసారు.

కొంతమందిని చంపడానికి అణుబాంబ్ ని సృష్టించిన‌ ఓపెన్‌హైమర్‌లా కాకుండా.. ఫిలింమేక‌ర్స్ స‌హా ప్రపంచం లోని ప్రజలందరి మనసుల్లోనూ పేలడానికి నోల‌న్ సినిమాటిక్ బాంబును సృష్టించాడు. జూలై 21న అతడు సృష్టించిన సినిమాటిక్ శ్మ‌శానవాటిక లో నోలన్ పేలుళ్లు ప్ర‌తిధ్వ‌నిస్తాయి. అణు యుగం కాదు.. నోలన్ యుగం రైజ్ అయింది'' అంటూ మ‌రొక ట్వీట్ లో పొగిడేసిన వ‌ర్మ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పాపుల‌ర్ మాస్-ఎనర్జీ ఈక్వేషన్‌తో నోల‌న్ ని పోల్చాడు. నోల‌న్ ఒక కొత్త‌త‌రం E= Mc square of CINEMA అంటూ ఆర్జీవీ కొత్త స‌మీక‌ర‌ణం అందించాడు.