నటి హ్యాండ్‌బ్యాగ్ ఖరీదుతో సినిమా తీసేయొచ్చు
దీని ఖరీదు సుమారు 10లక్షలు. ఇంత ఖరీదు దేనికోసం అని అడగొద్దు. అది బ్రాండెడ్ బ్యాగ్. పైగా విదేశీ బ్రాండ్. కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఇలాంటివి ధరిస్తుంటారు.
By: Tupaki Desk | 13 Oct 2023 2:30 AM GMTనటి సోనమ్ కపూర్ తన సినిమాలు పాత్రలతోనే కాకుండా తన ప్రకటనలు ఫ్యాషన్ సెన్స్‌తో కూడా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. కాలక్రమేణా తన జీవనశైలికి సంబంధించి కొన్ని ప్రకటనలతోను ఆకర్షించింది. ఇటీవలే ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో తళుక్కున మెరిసింది నటి సోనమ్ కపూర్ అహూజా. ఫ్యాషన్ పుట్టిల్లు ప్యారిస్ ని గజగజ ఒణికించింది ఈ బ్యూటీ. అక్కడ ఖరీదైన బ్రాండ్లకు ప్రచారం కల్పించింది. ఇక ప్యారిస్ కి, కేన్స్ కి వెళ్లడం సోనమ్ కి ఇప్పుడే కొత్త కాదు కానీ, ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనంతో చర్చల్లోకి రావడం తనకు హాబీగా మారిందని చెప్పాలి.
ఇప్పుడు సోనమ్ కపూర్ అలా విమానాశ్రయం నుంచి బయటికి వస్తూ కెమెరా కళ్లకు చిక్కింది. ఇక తన ఎయిర్ పోర్ట్ లుక్ సహా చేతికి తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్ పైనే అందరి కళ్లు. ఇది పాపులర్ హెర్మేస్ బ్రాండ్ లెదర్ బ్యాగ్. దీని ఖరీదు సుమారు 10లక్షలు. ఇంత ఖరీదు దేనికోసం అని అడగొద్దు. అది బ్రాండెడ్ బ్యాగ్. పైగా విదేశీ బ్రాండ్. కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఇలాంటివి ధరిస్తుంటారు. సోనమ్ దగ్గర ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో ఉన్నాయి. ఇక ఒక చిన్న బ్యాగ్ కోసం ఇంత బడ్జెట్ పెట్టడం చూస్తుంటే, ఈ బడ్జెట్ లోనే ఆర్జీవీ లాంటి డైరెక్టర్ ఒక సినిమా తీసేస్తాడు... అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఆర్జీవీ ఇంతకుముందు ఐస్ క్రీమ్ లాంటి సినిమాల్ని లక్షల్లోనే తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
యూట్యూబర్‌పై అహూజా పోలీస్ కేస్ ఇప్పుడు సోనమ్ కి చెందిన ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో యూట్యూబర్ ఒకరు సోనమ్ కపూర్ స్టేట్‌మెంట్‌పై కామెంట్ చేయడం గమనార్హం. ప్రతిగా అందాల నటి సోనమ్ భర్త ఆనంద్ అహుజా యూట్యూబర్‌పై కేసు పెట్టారు.
అయితే కేవలం 6,000 వీక్షణలతో కూడిన యూట్యూబ్ ఛానెల్ కంటెంట్ సృష్టికర్తపై చట్టపరమైన చర్య తీసుకోవడానికి ఆనంద్ అహుజా చేసిన చర్యకు నెటిజన్ల నుండి అనూహ్య స్పందన వచ్చింది. ఆనంద్ పరువునష్టం దావాపై నెటిజన్లు ప్రతిస్పందించారు. అహూజా లీగల్ నోటీసు వైరల్ అయ్యింది.
అయితే ఆన్‌లైన్ కమ్యూనిటీ నుండి దీనిపై విమర్శలు చెలరేగాయి. ఒక నెటిజన్ ఇలా వ్యాఖ్యానించారు. ''మీరు యూట్యూబ్‌లో 'సోనమ్ కపూర్ మూగ క్షణాలు' అని టైప్ చేస్తే చాలామంది యూట్యూబర్‌లు రూపొందించిన మిలియన్ల వీక్షణలతో అనేక వీడియోలను మీరు కనుగొంటారు. కానీ సోనమ్ ఆమె భర్త కేవలం 6000 వీక్షణలను కలిగి ఉన్న వీడియోతో అసౌకర్యంగా ఉన్నారా? నా ఉద్దేశ్యం ఈ లీగల్ నోటీసుకు ముందు ఈ వీడియోని ఎవరు చూశారు ఎందరు చూసారు? అని వ్యాఖ్యానించాడు.
యూట్యూబర్ చెప్పినది తప్పు కాదు అని సమర్థించారు కొందరు. అయితే సోనమ్ చెప్పింది సరైనది కాకపోవచ్చు కానీ ఒక వ్యక్తి గీతను దాట కూడదు. సెలబ్రిటీని కూడా గౌరవించాలి. కామెంట్లు చేయడానికి కొన్ని బలమైన కారణం ఉండాలి.. అని సోనమ్ తరపున పలువురు వాదించారు. ప్రజల జీవితంలో గోప్యత అవసరం. ఇతర వ్యక్తుల దృక్పథాన్ని గౌరవించాలి. అది ఆమె జీవితం ఆమెను తన మార్గంలో జీవించనివ్వండి.. అని ఒకరు సోనమ్ గురించి వ్యాఖ్యానించారు.