వ్యూహం ప్యాకేజ్.. వర్మ ఏమన్నారంటే?
అయితే ట్రైలర్‌ను రిలీజే చేసిన సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మీడియాతో ముచ్చటించారు. పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
By: Tupaki Desk | 13 Oct 2023 1:30 PM GMTకాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ... ప్రస్తుతం వ్యూహం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను కూడా ఆయన రిలీజ్ చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుతం ఆంధ్రా సీఎం జగన్ మోహన్ రెడ్డి గార్ల జీవిత చరిత్రలను ఆధారంగా ఆయన తీసున్న సినిమాలే వ్యహం అండ్ శపథం.
అయితే ట్రైలర్‌ను రిలీజే చేసిన సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మీడియాతో ముచ్చటించారు. పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈ చిత్రం తీయడానికి వెనక ఎలాంటి వ్యూహం లేదు. ఈ సినిమాలో నిజం మాత్రమే కనిపిస్తుంది. వ్యూహం రెండు భాగాలుగా రానుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో ఈ రెండు చిత్రాల కథలు ఉంటాయి. నేను ఎంతో సౌమ్యుడిని. చంద్రబాబును ఎప్పుడూ కలవలేదు. జగన్ అంటే నాకంటూ ఓ ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. అలాగే చంద్రబాబు అంటే కూడా ఓ అభిప్రాయం ఉంది. కానీ నిజాన్ని మాత్రమే ఈ చిత్రంలో ప్రజలు చూస్తారు. జగన్ మీద నాకున్న అభిప్రాయాన్ని వ్యూహం చిత్రంలో చూస్తారు అని వర్మ అన్నారు.
నేను వేరే వాళ్ల పై సినిమా చేయమంటే చెయ్యను. చిత్రంలో నేను నమ్మిన నిజం మాత్రమే ఉంది. అయినా పబ్లిక్ డొమైన్‌లో ఉన్న వారి జీవితాలపై సినిమా చేయ్యడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ , సర్కార్ వంటి చిత్రాలను అలానే చేశాను. ఇప్పుడు జగన్‌పై ఉన్న అభిమానంతో ఈ చిత్రం చేశాను. కానీ ఇక్కడ ప్యాకేజీ అనే దానికి అస్సలు ఆస్కారం లేదు. నాకు తేదేపా గురించి కానీ వైసీపీ గురించి కానీ వేరే పార్టీ గురించి తెలీదు. నేను నమ్మిన నిజం మాత్రమే ఈ చిత్రంలో చూపిస్తున్నాను. నా రీసెర్చ్‌లో ఏం జరిగిందో అదే ఈ చిత్రం. ఇంకా ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉంది అని వర్మ పేర్కొన్నారు.
ఇకపోతే దేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా పడని కష్టాలను వైఎస్ జగన్ పడ్డారని, అందుకే ఈ చిత్రాన్ని తిస్తున్నట్లు వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం ఎంతో చేస్తుందని, ఆయన ప్రజల గుండెళ్లో చిరస్థాయిగా ఉంటారని చెప్పారు. ప్రజలు.. మళ్లీ వైఎస్ జగన్‌కే పట్టం కడతారని, అదే జరుగుతుందని కిరణ్ కుమార్ పేర్కొన్నారు.