Begin typing your search above and press return to search.

రియా బోల్డ్ డెనిమ్ లుక్ వైర‌ల్

సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం త‌న లేటెస్ట్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

By:  Tupaki Desk   |   22 Oct 2024 6:09 AM GMT
రియా బోల్డ్ డెనిమ్ లుక్ వైర‌ల్
X

ఊహించ‌నిది జ‌రిగితే దానిని ఎదుర్కోవ‌డ‌మే ధైర్య‌వంతుని ల‌క్ష‌ణం. అలాంటి ధైర్యం త‌న‌కు ఉంద‌ని నిరూపించింది రియా చ‌క్ర‌వ‌ర్తి. తూనీగ తూనీగ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన‌ రియా చ‌క్ర‌వ‌ర్తి బాలీవుడ్ యువ‌హీరో సుశాంత్ సింగ్ తో ప్రేమాయ‌ణం సాగించ‌డం, డ్ర‌గ్స్ స్కామ్, మ‌నీలాండ‌రింగ్‌లో త‌న‌ పేరు వినిపించ‌డం, అనంత‌రం సుశాంత్ ఆత్మ‌హ‌త్య వ‌గైరా సంచ‌ల‌నాలు అయ్యాయి. ఈ కేసులో రియా చక్ర‌వ‌ర్తి అరెస్ట‌యి జైలులో కొన్ని నెల‌ల‌పాటు ఉండాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం బెయిల్ పై బ‌య‌టే ఉన్న రియా తిరిగి త‌న జీవితాన్ని కొత్త కోణంలో చూపించేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.


రియా చక్రవర్తి తన మాజీ ప్రియుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 2020లో మరణించిన తర్వాత త‌న‌పై వ‌చ్చిన‌ అభియోగాలు క్లియర్ కావడానికి ముందు కొంతకాలం జ్యుడీషియల్ రిమాండ్‌లో కూడా ఉంది. దీనిపై అప్ప‌ట్లో హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో మాట్లాడిన రియా, వీటన్నింటికీ ముందు తాను భ్రమ‌ల‌తో కూడుకున్న ఆశావాదిని అని తెలిపింది. తాను ఎప్పుడూ తన పనిని ఆస్వాధించాలనుకుంటాన‌ని, ఎలాంటి లక్ష్యాలు లేకుండా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటాన‌ని రియా చ‌క్ర‌వ‌ర్తి అన్నారు. ఆరోప‌ణ‌ల కార‌ణంగా..దేశం మొత్తం నాపై ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటుందో, మంచి లేదా చెడును మరచిపోతుందని నేను క‌చ్ఛితంగా ఊహించలేను! నటిగా కూడా నా ఆశయం ఎప్పుడూ నంబర్ 1 కాదు.. నేను ఒక క్రాఫ్ట్‌గా నటనను ఆస్వాధించడం ప్రారంభించాను. దాని గురించి లక్ష్యాలు లేవు. జ‌గ‌ర‌బోయేదానికి ఎవరూ నన్ను సిద్ధం చేయలేదు. వారు నన్ను.. చుడైల్, కాలా జాదు కర్నే వాలీ, నాగిన్ లాంటి పేర్లతో పిలుస్తారు.. కానీ నేను దేనినీ నిజంగా పట్టించుకోను. ఇలాంటివి ఇంతకుముందు నన్ను కలవరపెట్టేవి కానీ ఇప్పుడు కాదు! అని తెలిపింది.


అయితే రియా తన జీవితాన్ని తిరిగి పొందాలంటే `క్షమించే మార్గం`లో వెళ్ళవలసిందిగా భావించాన‌ని, దాదాపు బలవంతంగా ఇది జ‌రిగింద‌ని చెప్పింది. జ‌రిగినదంతా క్షమించాలని నా హృదయంలో ఉంటుందని నేను అనుకోలేదు. కానీ నేను చాలా కాలంగా చాలా కోపంగా ఉన్నందున క్ష‌మాగుణం సింపుల్ మార్గంగా మారింది. నాకు వచ్చిన కోపం అంతా గట్ సమస్యలు.. అసిడిటీ మాత్రమే. నేను దాదాపు మూడేళ్లపాటు ఎసిడిటీతో చాలా బాధపడ్డాను. క్షమాపణ ఒక్కటే ఆప్షన్‌గా మారింది. నేను దాదాపు క్షమాపణ మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది.. అని తెలిపింది.


2020లో సుశాంత్ మరణించిన తర్వాత, రియా అతడి ఆత్మహత్యకు ప్రేరేపించిందని ఆరోపణలు వచ్చాయి. మనీలాండరింగ్ ఆరోపణలపై రియాను ఆమె సోదరుడు షోక్‌ను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రశ్నించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసును స్వాధీనం చేసుకున్న తరువాత, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) సుశాంత్‌కు గంజాయి సరఫరా చేశారనే ఆరోపణతో రియాను ఆమె సోదరుడిని అరెస్టు చేసింది. అయితే సుశాంత్ డ్ర‌గ్స్ వ్యసనానికి రియా ఆర్థిక సహాయం చేసిందనే ఎన్‌సిబి సిద్ధాంతాన్ని బాంబే హైకోర్టు తిరస్కరించింది.

రియా వ‌రుస ఫోటోషూట్లు:

రియా చ‌క్ర‌వ‌ర్తి ఇటీవ‌ల గ‌తాన్ని మ‌రిచి యాక్టివ్ గా ఉంటోంది. సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం త‌న లేటెస్ట్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఒక వివాదం త‌ర్వాత త‌న‌కు అవ‌కాశాలిచ్చేవారు క‌రువయ్యారు. కానీ మొక్క‌వోని ధీక్ష‌తో త‌న వంతు ప్ర‌య‌త్నాల‌ను ఆప‌డం లేదు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో రియా గ్లామ్ ఫోటోగ్రాఫ్స్ వేగంగా వైర‌ల్ అవుతున్నాయి. తాజా ఫోటోషూట్ లో రియా డెనిమ్స్ లో స్ట‌న్నింగ్ లుక్ తో క‌నిపించింది. ఓవైపు డెనిమ్స్ ధ‌రించినా ఇన్న‌ర్ అందాల‌ను ఎలివేట్ చేయ‌డంలో రియా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. మెడ‌లో గోల్డ్ పెండెంట్ చైన్ రియా అందాల‌ను స్పైస‌ప్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలోకి దూసుకెళుతున్నాయి.