ఛాన్సులివ్వలేదని లబోదిబో మంటోన్న హీరోయిన్!
కానీ ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వడం లేదు. నాతో సినిమాలు చేసేందుకు భయపడుతున్నారు.
By: Tupaki Desk | 16 Nov 2023 2:30 PM GMTసుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ప్రేయసి రియా చక్రవర్తి చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఆత్మహత్య..హత్యా? అన్న కోణంలో సాగిన విచారణ నేపథ్యంలో రియా జైలు జీవితం గడపడం..అటుపై బెయిల్ పై రావడం వంటి సన్నివేశాలు ఆమె కెరీర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఓ వైపు తానేతప్పు చేయలేని మొర పెట్టుకున్నా! వినే పరిస్థితి కనిపించలేదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మానసిక కృంగిబా టుకు గురిచేసింది.
ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ట్రోలింగ్ కూడా తగ్గింది. తాజాగా ఈ పరిస్థితిని ఉద్దేశించి రియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా పై వచ్చిన విమర్శలు..ఆరోపణల సమయంలో నా కుటుం బం..స్నేహితులు అండగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వడం లేదు. నాతో సినిమాలు చేసేందుకు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం జీవితంలో ఇదే మొదటిసారి' అని వాపోయింది.
దీంతో రియా చక్రవర్తి వృత్తిగత జీవితం డైలమాలో పడినట్లు కనిపిస్తుంది. కేసు నుంచి తాను ఇంకా అనుమా నితురాలిగానే ఉంది. నిర్దోషిగా నిరూపించుకుని వస్తే తప్ప అవకాశాలి వ్వడం కష్టం. మరి ఈ ఫేజ్ ని ఎలా దాటుతుంది? అన్నది చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో రియా హిందీ అవకాశాలకన్నా ఇతర భాషల్లో ప్రయత్నాలు చేస్తే కొత్త అవకాశాలకు ఛాన్స్ ఉండొచ్చు. అయితే బాలీవుడ్ తరహాలో దక్షిణాది పరిశ్రమలో అమ్మడికి అవకాశాలు అంత సులభం కాదు.
వివాదాస్పద నటీమణుల్ని సౌత్ ఇండస్ట్రీ అందరికంటే ముందే పక్కనబెడుతుంది. శ్వేతాబసు ప్రసాద్ పార్క్ హయత్ సన్నివేశం తర్వాత టాలీవుడ్ కి ఎలా దూరమైందో తెలిసిందే. ఆ సమయలో శ్వేతని ఆదుకుంది బాలీవుడ్ పరిశ్రమే. ఓ పేరున్న దర్శకుడు అమ్మడికి అవకాశాలిచ్చి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత శ్వేత బసు సౌత్ ఇండస్ట్రీ వైపు చూసింది లేదు.