సుశాంత్ సింగ్ కేసులో రియాకు కోర్టు ఊరట
దీని కోసం రియా ఇంతకుముందు కోర్టును అనుమతి కోరింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
By: Tupaki Desk | 7 March 2024 3:49 PM GMTసుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు నేపథ్యంలో ముంబైలోని ప్రత్యేక కోర్టు నటి రియా చక్రవర్తి ఆమె సోదరుడు విహారయాత్ర కోసం విదేశాలకు (థాయ్‌లాండ్) వెళ్లేందుకు అనుమతిని మంజూరు చేసింది. దీని కోసం రియా ఇంతకుముందు కోర్టును అనుమతి కోరింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తనపై సీబీఐ వేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను రద్దు చేయాలని కోరుతూ రియా కోర్టును ఆశ్రయించగా ఇందులో తనతో పాటే ఆమె తండ్రి, సోదరుడు కూడా ఉన్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో తనకు వ్యతిరేకంగా జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి)ని నిలిపివేయాలని కోరుతూ రియా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. వృత్తిపరమైన కమిట్‌మెంట్‌ల కోసం తాను దుబాయ్ వెళ్లాలని పేర్కొంది. అయితే ఆమెకు ఉపశమనం కల్పించడాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వ్యతిరేకించింది.
14 జూన్ 2020న ప్రియుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన తర్వాత రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కొంటున్నారు. ఆమె న్యాయవాదులు అభినవ్ చంద్రచూడ్ , ప్రసన్న భంగలే కోర్టులో వ్యాఖ్యానిస్తూ... CBI నటిపై FIR నమోదు చేసిందని, కానీ ఎప్పుడూ సమన్లు ఇవ్వలేదు గనుక తనపై గత కొన్ని సంవత్సరాలుగా ఈ కేసులో ఏమీ జరగలేదని అన్నారు. గడిచిన కొన్నేళ్లుగా రియా చక్రవర్తి విదేశాలకు వెళ్లారా? అని న్యాయమూర్తులు అజయ్ గడ్కరీ, శ్యామ్ చందక్‌లతో కూడిన ధర్మాసనం వారిని ప్రశ్నించింది. వారు సంబంధిత వివరాలను అందించారు.
2020లో యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం తర్వాత రియా చక్రవర్తి తన వ్యక్తిగత విషయంలో అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసిందనే ఆరోపణలపై రియా 28 రోజుల పాటు బైకుల్లా జైలులో ఉన్నారు. రియా తన జైలు జీవితం గురించి చాలా ఎమోషనల్ గా వ్యాఖ్యానించింది.