Begin typing your search above and press return to search.

పోగొట్టుకోవ‌డానికి ఏమీ లేదు.. స‌ర్వం కోల్పోయాను: రియా

"పోగొట్టుకోవడానికి ఏమీ లేదు.. నేను అన్నింటినీ కోల్పోయాను" అంటూ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేసింది రియా చ‌క్ర‌వ‌ర్తి.

By:  Tupaki Desk   |   8 Dec 2023 4:59 AM GMT
పోగొట్టుకోవ‌డానికి ఏమీ లేదు.. స‌ర్వం కోల్పోయాను: రియా
X

"పోగొట్టుకోవడానికి ఏమీ లేదు.. నేను అన్నింటినీ కోల్పోయాను" అంటూ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేసింది రియా చ‌క్ర‌వ‌ర్తి. ఈ వ్యాఖ్య‌ల అనంత‌రం రియా త‌న యోగా సెష‌న్స్ నుంచి షేర్ చేసిన ఒక వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. రియా త‌న లైఫ్‌లో అన్నీ కోల్పోయాన‌నే నిరాశ‌తో ఉందా? అంటే... నిరాశ‌ను జ‌యించేందుకు ఇలా యోగా ధ్యానాన్ని ఆశ్ర‌యిస్తోంది.. నెమ్మదిగా కంబ్యాక్ అవుతోంది! అంటూ నెటిజ‌నులు సోష‌ల్ మీడియాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. కొంద‌రు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం త‌ర్వాత రియా తాను స‌ర్వం కోల్పోయాన‌ని భావిస్తోందా? అంటూ సందేహం వ్య‌క్తం చేసారు.

ప్రియుడు సుశాంత్ సింగ్ మరణించిన తర్వాత రియాను నెటిజ‌నులు సోషల్ మీడియాలో వెంటాడి వేటాడారు. అతడితో ఆమెకు ఉన్న సంబంధానికి పేర్లు పెట్టారు. ర‌క‌ర‌కాల ఆరోపణలు చేసారు. సుశాంత్ సింగ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణంలో ఆమె పాత్ర‌ను ప్ర‌శ్నించారు. అరెస్టులు, జైలు జీవితం వ‌గైరా తెలిసిన వ్య‌వ‌హారాలే. అయితే రియా చక్రవర్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మరింత బలంగా తిరిగి కంబ్యాక్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. వ్యక్తిగత జీవితంపై ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా కానీ.. రియా మానసికంగా దృఢంగా ఉండాలని భావించింది. త‌న మార్గంలో వచ్చిన ప్రతి వార్ ని బలమైన మనస్సుతో ఎదుర్కొంది. తాజాగా భయం గురించి మాట్లాడిన రియా మళ్లీ చర్చనీయాంశమైంది.

14 జూన్ 2020న మరణించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో అప్ప‌టికే రియా రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అత‌డి మ‌ర‌ణం రియా చ‌క్ర‌వ‌ర్తిని చాలా ఇబ్బందుల‌కు గురి చేసింది. ఇటీవలి ఇంటర్వ్యూలో ఇలాంటి భ‌యాల గురించి రియా చక్రవర్తి మాట్లాడుతూ, సినిమా జీవితంలా ..కిసీ కో ఇత్నా భీ మ్సత్ దారో కి ఉంక దర్ ఖతం హో జాయే.. అని వ్యాఖ్యానించింది. నా విషయంలో నా కుటుంబం విషయంలో చాలా భయపడాల్సిన అవసరం ఉందని నేను అనుకున్నాను. కానీ ఒక పాయింట్ తర్వాత నిర్భయంగా మారాన‌ని మీకు తెలుసు. మీరు ఆ స్థాయికి న‌న్ను కిందికి లాగారు కానీ మీకు తెలిసిందేమీ లేదు. ఇప్పుడు నేను కోల్పోవడానికి ఏమీ లేదు.. నేను అన్నింటినీ కోల్పోయాను.." అని ఆవేద‌న‌ను క‌న‌బ‌రిచింది.

"నేను ప్రతిష్టను కోల్పోయాను.. నేను ప్రియమైన వ్యక్తిని కోల్పోయాను.. ఇప్పుడు జైలులో ఉన్న నా సోదరులను మిస్స‌య్యాను.. ఇప్పుడు నేను జైలుకు వెళుతున్నాను.. నా తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నారు.. ఇంతకంటే ఇంకేం కావాలి మీకు? కాబట్టి అన్నిటి నుంచి ఒక స్థితి స్థాప‌క‌త నాకు అల‌వ‌డింది. నా సహనం ఎక్కడ ఎప్పుడు ఎలా రావాలో అక్కడ వస్తుంది. అక్కడ దేవుడిపై నమ్మకం లేదా దైవిక శక్తిపై నమ్మకం వస్తుంది. కాబట్టి అప్పటి వరకు ఎవ‌రైనా భయపడుతారని నేను భావిస్తున్నాను. కానీ ఒక నిర్దిష్ట స్థాయికి మించి ఎవరూ వెళ్ల‌లేరు. బంగీ జంప్‌ని ఉదాహరణగా తీసుకోండి. మీరు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తూ పైకి ఎక్కినప్పుడు మీ ఆడ్రినలిన్‌లో పంపింగ్ పెరుగుతుంది. మీరు మొదటి అడుగు వేసిన తర్వాత మీరు చాలా ఆందోళన చెందుతారు. నిజానికి ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా భయం పోతుంది! జీవితం కూడా అంతే.. అని తాత్వికంగా మాట్లాడింది రియా.

రియా తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల గురించి ఓపెన‌వ్వ‌డం ఇదే మొదటిసారి కాదు. గతంలో త‌న‌పై ప్రతికూలత గురించి, జైలు జీవితం స‌హా తాను అనుభవించిన కఠినంగా గ‌డిచిన గ‌త‌ నాలుగు సంవత్సరాల వ్య‌థ‌ గురించి ఓపెనైంది. రియా నెమ్మ‌దిగా కోలుకుంటూ పాజిటివ్ ధృక్ప‌థంతో.. స్థిరంగా ప్రజల హృదయాలలో మనస్సులలో ఒక ముద్ర వేసింది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... టీవీ షోల‌తో బిజీగా ఉంది. రియా చ‌క్ర‌వ‌ర్తి టాలీవుడ్ లో సుమంత్ అశ్విన్ స‌ర‌స‌న తూనీగ తూనీగ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.