తండ్రికి తెలియకుండా సినిమాపై యువ హీరో పెట్టుబడులు
అయితే ఇక్కడే అసలు గేమ్ మొదలైంది. దర్శకుడు, నిర్మాతలుగా ఉన్న వాళ్లు సినిమాకు నాలుగు కోట్ల బడ్జెట్ అని ముందుగా చెప్పారు.
By: Tupaki Desk | 6 April 2025 7:34 AMతెలుగు చిత్రపరిశ్రమలో ఈమధ్య చాలామంది హీరోలుగా మారారు. కానీ అందులో కొందరికి ఆ అవకాశం సొంతంగా వస్తే.. మరికొందరు వెనుక నుండి తోసిన బలంతో తెరపైకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఓ సందర్భం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఓ బడా పారిశ్రామికవేత్త తన కుమారుడిని హీరోగా చూడాలనే తపనతో సుమారు నాలుగున్నర కోట్ల బడ్జెట్‌తో ఓ సినిమా ఫైనాన్స్ చేశాడట. ఈ విషయాన్ని ఇండస్ట్రీలోకి ఎవరూ పబ్లిక్‌గా చెప్పలేకపోయినా, ఆర్థిక లావాదేవీలు చూసే వారికి మాత్రం బాగా తెలుసునంటున్నారు.
అయితే ఇక్కడే అసలు గేమ్ మొదలైంది. దర్శకుడు, నిర్మాతలుగా ఉన్న వాళ్లు సినిమాకు నాలుగు కోట్ల బడ్జెట్ అని ముందుగా చెప్పారు. కానీ కొన్ని రోజుల అనంతరం సీన్ మారింది. ఆ యువకుడు, తన తండ్రికి తెలియకుండా మరో మూడు కోట్లు అదనంగా ఖర్చుపెట్టాడట. అవును, రిచ్ కిడ్స్‌కైతే ఇది పెద్ద విషయం కాదు అనొచ్చు. కానీ బిజినెస్ పరంగా చూస్తే ఈ డెసిషన్ మాత్రం చాలా డేంజరస్‌గా మారిందంటున్నారు ట్రేడ్ వర్గాలు.
ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా మీద నాన్ థియేట్రికల్ గా రూపాయి రికవరీ అయ్యే అవకాశం లేదట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి రిలీజ్‌కు ముందే డిజిటల్, సాటిలైట్ డీల్స్ జరగాల్సి ఉంది. కానీ స్టార్ కాస్ట్ లేకపోవడం, మార్కెట్ లో క్రేజ్ లేకపోవడంతో ఎవ్వరూ ముందుకు రావడం లేదు. మ్యూజిక్, టీజర్, ప్రమోషన్లు అన్నీ యావరేజ్ గా ఉండటంతో ఆడియన్స్ ఫీలింగ్ కూడా అంతంత మాత్రమే. దీంతో బిజినెస్ పూర్తిగా క్లోజ్ అవ్వలేదు. విడుదలకి ముందే నిర్మాతల గుండెల్లో వణుకు మొదలైందట.
నిర్మాతకు సినిమాలు డీల్ చేయడంలో పెద్ద అనుభవం లేదు. అయినా సరే, ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ ఫ్యామిలీ చాలా కాలంగా సినిమా నిర్మాణంలో ఉన్నవారే అయినా, ఈసారి మాత్రం ఆలోచించకుండా చేసిన పెట్టుబడి మళ్లీ తలనొప్పిగా మారిందని టాక్. కొడుకు డెబ్యూ కావాలన్న తపనతో చేసిన ఖర్చు, ఇప్పుడు తల పట్టుకునే స్థితిలోకి తీసుకెళ్లిందన్నదే ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.
పలుమార్లు బడ్జెట్ పెరగకుండా ఉండాలని అడ్వైజ్ చేసిన ప్రొడక్షన్ మేనేజర్స్ మాట వినకుండా, కొత్త టెక్నాలజీలు, గ్రాండ్ సినిమాటోగ్రఫీ అనే పేర్లతో అధిక ఖర్చు పెట్టారని సమాచారం. కానీ అసలైన సమస్య కంటెంట్ లోనే ఉండటం వల్ల, ఎక్కడైనా రికవరీ అయ్యే ఛాన్స్ లేదు అని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఇప్పుడు థియేటర్ రిలీజ్ కు అసలు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ చుట్టూ ఉన్నవారే ‘ఓపెన్’గా కామెంట్స్ చేస్తున్నారు. కొడుకు నటన పట్ల నమ్మకం పెట్టుకోవడం తప్పు కాదు కానీ, మార్కెట్ రూల్స్ తెలిసిన తరువాతే అడుగులు వేయాలెల్సిందని అంటున్నారు. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.