Begin typing your search above and press return to search.

'మిరపకాయ్‌' బ్యూటీ ఎలా మారిందో చూడండి

అయితే రిచా గంగోపాధ్యాయ వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలోనే చదువు కోసం విదేశాలకు వెళ్తున్నట్లుగా ప్రకటించింది.

By:  Tupaki Desk   |   6 Oct 2024 8:30 AM GMT
మిరపకాయ్‌ బ్యూటీ ఎలా మారిందో చూడండి
X

టాలీవుడ్‌ లో హీరోయిన్‌ గా రానాతో కలిసి లీడర్‌ సినిమాతో 2010లో పరిచయం అయిన ముద్దుగుమ్మ రిచా గంగోపాధ్యాయ. ఈ అమ్మడు కెరీర్‌ ఆరంభంలోనే వరుసగా సినిమా ఆఫర్లు సొంతం చేసుకుంది. రవితేజ తో ఈమె కలిసి నటించిన మిరపకాయ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ద్వారా వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే ఈమె మాత్రం చాలా అరుదుగా సినిమాలు చేస్తూ వచ్చింది. ప్రభాస్ తో ఈమె కలిసి నటించిన మిర్చి సినిమా సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే రిచా గంగోపాధ్యాయ వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలోనే చదువు కోసం విదేశాలకు వెళ్తున్నట్లుగా ప్రకటించింది.


విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన తర్వాత తిరిగి ఇండియాకు వచ్చి సినిమాల్లో నటిస్తుందని అంతా భావించారు. కానీ రిచా గంగోపాధ్యాయ తిరిగి రాలేదు. అక్కడే పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిరపడింది. అక్కడే ప్రస్తుతం ఫ్యామిలీతో జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నట్లుగా ఆమె సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసిన ఫోటోలను, వీడియోలను చూస్తే అర్థం అవుతుంది. సినిమాల్లో నటించే సమయంలో చాలా సన్నగా నాజూకుగా కనిపించిన రిచా గంగోపాధ్యాయ ఇప్పుడు మాత్రం చాలా లావు గా కనిపిస్తోంది. పెళ్లి పిల్లల కారణంగా ఆమె లుక్ పూర్తిగా మారిందని అభిమానులు సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.


ఇన్‌స్టాగ్రామ్‌ లో దాదాపు 80 వేల మంది ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫోటోలను షేర్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా మరోసారి తన అందమైన ఫ్యామిలీ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. అంతే కాకుండా రిచా లుక్ గురించి సైతం చర్చ మొదలు అయింది. ఇంత బరువు పెరిగారు ఏంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, మీరు బరువు పెరిగినా అందంగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. మీ క్యూట్‌ ఫోటోలను చూస్తూ ఉంటే మళ్లీ మీరు ఎప్పుడు సినిమాల్లో నటిస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం రిచా గంగోపాధ్యాయ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ముందు ముందు సెకండ్‌ ఇన్నింగ్స్ కి ఈమె ప్లాన్‌ చేస్తున్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, ఆమె లుక్ ను చూస్తూ ఉంటే మాత్రం కచ్చితంగా రిచా గంగోపాధ్యాయ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా లేదేమో అనిపిస్తుంది. ఒక వేళ ఆమె రీ ఎంట్రీ ఇస్తే మాత్రం అద్భుతం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఆమెకు సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలు షేర్‌ చేస్తూ తిరిగి ఇలాంటి రిచా మాకు కావాలి అంటున్నారు. రిచా తో పాటు ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోయిన్స్ ఇంకా సినిమాలు చేస్తున్నారు. కనుక ఈమె చేస్తే బాగుండు అనేది కొందరు ఫ్యాన్స్ అభిప్రాయం.