మందు కొట్టి డ్యాన్స్ చేద్దామని ట్రై చేసా కానీ..!
మొదటి రోజు తాగి డ్యాన్స్ చేయడమెలానో నాకు అర్థం కాలేదు. కాబట్టి 30-40 టేక్స్ తీసుకున్న తర్వాత.. నాకు ఒక క్వార్టర్ తీసుకు రండి.. ఏం జరుగుతుందో చూద్దాం.. అని అన్నాను.
By: Tupaki Desk | 12 May 2024 6:55 AM GMTఇటీవలే ప్రపంచవ్యాప్తంగా గొప్ప వీక్షణలు(వ్యూవర్ షిప్) అందుకున్న భారతీయ వెబ్ సిరీస్‌లో నటించింది సదరు యంగ్ బ్యూటీ. ఇందులో ఒక డ్యాన్స్ సీక్వెన్స్ చేయడానికి ముందు కొద్దిగా జిన్ తాగానని చెప్పి ప్రపంచానికి షాకిచ్చింది. జిన్ తాగి స్టెప్పులేస్తుంటే.. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించగలరా ఎవరైనా?
ఈ ఎపిసోడ్ లో నటి పేరు - రిచా చద్దా. కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన భారీ క్రేజీ సిరీస్ హీరామండిలో వేశ్య పాత్రలో నటించింది రిచా. వేశ్య అంటే మందు వేయడం.. డ్యాన్స్ చేయడం వగైరా చాలా సహజం. అలాంటి ఒక సీన్ లో తాగి డ్యాన్స్ చేయడానికి తాను కొద్దిగా జిన్ ప్రయత్నించానని రిచా చద్దా చెప్పారు.
నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో 'హీరామండి: ది డైమండ్ బజార్' ఇటీవల స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో లజ్జో పాత్రలో తన నటనకు గొప్ప పేరు తెచ్చుకుంది రిచా చద్దా. ఈ భామ హీరామండి సిరీస్ లో మెథడ్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. జూమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి రిచా చద్దా మాట్లాడుతూ.. తాను సిరీస్‌లో ఒక కఠినమైన సన్నివేశంలో నటించాను. తాగి కథక్ డ్యాన్స్ చేయాలి. ఆ సీక్వెన్స్ కోసం కొంచెం జిన్ ప్రయత్నించాను.. అని తెలిపారు.
మొదటి రోజు తాగి డ్యాన్స్ చేయడమెలానో నాకు అర్థం కాలేదు. కాబట్టి 30-40 టేక్స్ తీసుకున్న తర్వాత.. నాకు ఒక క్వార్టర్ తీసుకు రండి.. ఏం జరుగుతుందో చూద్దాం.. అని అన్నాను. నా కోసం కొంచెం జిన్ ఉంది. నేను కొంచెం తాగాను. కానీ దాని వల్ల పరిస్థితి మరింత దిగజారింది. నా శరీర కదలికలో ఆ బద్ధకం కనిపించాలని కోరుకోలేదు. నాకు కొంత లేజీనెస్ కావాలి.. తాగాను కాబట్టి బహుశా కచ్చితత్వం కనిపిస్తుందనుకున్నాను.. అని అన్నారు.
''వాస్తవానికి కొంచెం చులకన కావడం కంటే నేను తాగినట్లు నటించడం మంచిది. ఇది టెక్నికల్ జాబ్, నేను ఎంత డాన్స్ చేసినా కానీ నా డ్రెస్ చాలా హెవీగా ఉంది.. కానీ డ్యాన్సులో ఆశించిన మార్క్ ను తాకాలి... ఇతరులతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇది నాకు సరదాగా అనిపించింది'' అని రిచా చద్దా అన్నారు.
ఆ సీక్వెన్స్ కోసం 99 టేకులు: నేను దాదాపు సెంచరీ కొట్టాను! అని తనపై తానే సెటైరికల్ గా స్పందించారు రిచా చద్దా. మీకు తెలుసా.. మందు కొట్టి డ్యాన్స్ చేయడం సులభం కాదు... ఇలా చేయడం సులభం అని ప్రజలు అనుకుంటారు. దాదాపు 200 నుండి 300 మంది వ్యక్తులతో డ్యాన్స్ చేస్తుంటే ఆ సమయంలో బాగా రాణించలేకపోతున్నారనేది ఊహించుకోండి. కానీ మనం దానిని అధిగమించినప్పుడు, ''వావ్... నేను దీన్ని చేయగలననేది నాకు తెలియదు..అని అనిపిస్తుంది!'' అని రిచా అన్నారు. శనివారం ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ఎడిషన్‌లో పాల్గొన్న రిచా పైవిధంగా స్పందించారు. ఈ వేదికపై హీరామాండి సహనటులతో కలిసి రిచా అతిథిగా కనిపించారు.
రిచా భర్త , నటుడు అలీ ఫజల్ ఈ వారం ప్రారంభంలో ఇన్ స్టాలో రిచా నటనను ప్రశంసించారు. ''ఒక మూర్ఖుడు మాత్రమే లజ్జోను తీసుకొని పారిపోడు !! ఉత్తమంగా నటించావు! అని ప్రశంసించారు. ఈ ఏడాది రిచా- అలీ తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే.