తల్లైన నటి..రెండు రోజులు ఆలస్యంగా!
గర్భవతి అయిన దగ్గర నుంచి రిచా చద్దా బేబి బంప్ ఫోటోలు ఇన్ స్టాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 July 2024 5:30 PM GMTబాలీవుడ్ నటి రిచా చద్దా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జులై 16న ఆమెకు పాపాయి పుట్టినట్లు వెల్లడించింది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో ఆమె గర్భవతి అన్న సంగతి రివీల్ చేసింది. అంత వరకూ సైలెంట్ గా ఉన్న అమ్మడు ఒక్కసారిగా స్వీట్ న్యూస్ చెప్పి అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసింది. తాజాగా బిడ్డకు జన్మనిచ్చిన సంగతి ఆలస్యంగానే చెప్పింది. `మా పట్ల మీ ప్రేమ, అశీర్వాదాలకు ధన్యవాదాలు` అని రాసుకొచ్చింది.
అయితే బేబిని మాత్రం చూపించలేదు. పాపాయికి సంబంధించి ఎలాంటి ఫోటో అప్ లోడ్ చేయలేదు. కేవలం విషయం చెప్పేసి బై చెప్పే సింది. గర్భవతి అయిన దగ్గర నుంచి రిచా చద్దా బేబి బంప్ ఫోటోలు ఇన్ స్టాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. భర్తతో కలిసిన ఎన్నో ఫోటోలను షేర్ చేసుకుంది. రిచా చద్దా-అలీ జాఫర్ 2021 లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 2023 లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.
అంతకు ముందు దాదాపు తొమ్మిదేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారు. ఈ క్రమంలో విడిపోతున్నట్లు కూడా ప్రచారం సాగింది. కానీ అన్ని వదంతులను వివాహ బంధంతో రుజువు చేసారు. ఇప్పుడు ఇద్దరి బంధానికి అనుబంధంగా పాపాయి జన్మించింది. ఇకపై వారి జీవితాలు మరింత వెలుగు మయం కావడం ఖాయం. రిచా చద్దా ఇటీవలే రిలీజ్ అయిన హీరామండిలో నటించిన సంగతి తెలిసిందే.
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ భారీ విజయం సాధించింది. అందులో నటించిన నటీనటులకు మంచి పేరొచ్చింది. బేబి జననానికి ముందు రిచా చద్దాకి ఈ విజయం ఓ పాజిటివ్ వైబ్ గా చెప్పొచ్చు. ప్రసవం నేపథ్యంలో రిచా చద్దా ఏడాది పాటు రెస్ట్ లోనే ఉంటుంది. తప్పని సరిగా మూడు నెలల వరకూ బయటకు వచ్చే అవకాశం కూడా లేదు.