నోరా (X) రిచా: స్త్రీవాదంపై బాహాబాహీకి దిగారు!
ఇటీవలి ఇంటర్వ్యూలో స్త్రీవాదంపై నోరా ఫతేహి కౌంటర్ గురించి రిచా చద్దాను హోస్ట్ ప్రశ్నించారు. దానికి రిచా స్పందిస్తూ నోరా తన తప్పుడు ఆలోచనతో తప్పు దారి పట్టించింది
By: Tupaki Desk | 13 May 2024 4:12 AM GMTఅందాల భామలు రిచా చద్దా- నోరా ఫతేహి మధ్య వైరం గురించి తెలిసిందే. ఒకరంటే ఒకరికి సరిపడదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవలి ఇంటర్వ్యూలో స్త్రీవాదంపై నోరా ఫతేహి కౌంటర్ గురించి రిచా చద్దాను హోస్ట్ ప్రశ్నించారు. దానికి రిచా స్పందిస్తూ నోరా తన తప్పుడు ఆలోచనతో తప్పు దారి పట్టించింది..నిజంగా నిజమైన అవగాహన లేకుండా మాట్లాడుతోంది! అంటూ కౌంటర్ వేసింది.
స్త్రీవాదంలో అందమైన విషయం ఏమిటంటే అది స్త్రీల ప్రయోజనాలను కోరుకునేవారిని అంగీకరిస్తుంది కానీ స్త్రీవాదిగా ఉండడాన్ని తిరస్కరించిందని రిచా చద్దా అన్నారు. స్త్రీలు ఏ వృత్తిలో ఉండాలి? ఏం ధరించాలో ఎంచుకోవడానికి, స్వతంత్రంగా ఉండాలనుకోవడానికి.. కోరుకున్న చోట పని చేయడానికి ... ఇలాంటి ఎన్నో సొంత ఎంపికలు కలిగి ఉండటానికి కారణం స్త్రీవాదం .. మహిళలు ఉద్యోగాలలో ఉండాలనే నిర్ణయం పూర్వీకుల వల్ల వచ్చింది కాదు. కేవలం ఇంట్లో ఉండటం వారు నేర్పారు.. కాబట్టి 60వ దశకం చివరిలో తప్పుడు సామాజిక కట్టుబాట్లు గందరగోళానికి కారణమయ్యాయి. నోరా ఫతేహి అభిప్రాయం తప్పుదారి పట్టించేదిగా ఉందని నేను భావిస్తున్నాను. ఇది నిజంగా అవగాహన లేనితనం! అంటూ పంచ్ వేసింది.
స్త్రీవాదం సహా మహిళల సమస్యల విషయంలో రిచా చద్దా ఎప్పుడూ మీడియా ఎదుట తన గొంతు విప్పారు. తాజా ఇంటర్వ్యూలో నోరా ఫతేహి ప్రకటనతో రిచా విభేదించింది. దానితో పూర్తిగా ఏకీభవించలేనని చెప్పింది. స్త్రీలు పిల్లలను ప్రపంచంలోకి తీసుకువచ్చే బాధ్యతను తీసుకునేవారిగా నోరా ఫతేహి నిర్వచించారు. నేను దీనితో పూర్తిగా ఏకీభవించను. ''స్త్రీలు ఈ విధంగా ఉండాలి.. ఈ విధంగా కాదు'' అని నిర్వచించడాన్ని నేను అంగీకరించలేను! అని రిచా చద్దా అంది.
స్త్రీ వాదంపై ఇంతకీ నోరా ఏమంది?
ఇటీవల నోరా ఫతేహి బాలీవుడ్ లో వివాహాల వెనుక ఉన్న ప్రేరణ ఏమిటన్నదానిపై కామెంట్ చేసింది. ఇదే ఇంటర్వ్యూలో స్త్రీవాదంపైనా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం కోసం పోరాటం ఒక ముఖ్యమైన సమస్య అనేది నోరా అభిప్రాయం. ఆధునిక స్త్రీవాదం సమాజానికి హానికరం అని తాను నమ్ముతున్నట్టు నోరా పేర్కొంది. స్త్రీవాదం మన సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని నేను భావిస్తున్నాను అని అంది. కుటుంబం మద్దతు లేకుండా మహిళలు పూర్తి స్వాతంత్య్రం కోసం పోరాడాలనే ఆలోచనకు వ్యతిరేకంగా నోరా వాదించారు. నిజానికి మహిళలు సహజ సంరక్షకులుగా ఉండాలని విశ్వసించారు. నోరా ఫతేహి మహిళా సాధికారత ప్రాముఖ్యతను గుర్తించినా కానీ, అది కొంత వరకు మాత్రమే కొనసాగాలని విశ్వసించింది. మగవారి వల్లనే స్త్రీలకు అర్థం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
పరిశ్రమలో లింగ వాదాన్ని కూడా నోరా ఫతేహి తనదైన శైలిలో ఖండించడం చర్చనీయాంశమైంది. స్త్రీ వాదం పెచ్చుమీరితే ప్రమాదాలున్నాయని అంది నోరా. పురుషులు కుటుంబ సంరక్షకునిగా బాధ్యతలను భుజానకెత్తుకుంటారు. కుటుంబ పోషణలో తమ పాత్రకు ప్రాధాన్యత ఇవ్వడానికి స్త్రీలకు స్వేచ్ఛ ఉంటుంది కానీ... సమతుల్యత అవసరమని అభిప్రాయపడింది. ఆర్థిక మద్దతు కోసం ఆడా మగా విధులు నిర్వర్తిస్తే ఇరువురూ సమానంగా ఉండాలనుకుంటే, కుటుంబ అదనపు బాధ్యతలను ఎవరు తీసుకుంటారనే ప్రశ్న తలెత్తుతుందని నోరా విశ్లేషించారు. ఓవరాల్ గా స్త్రీ తన కేటాయింపులను గుర్తించి సమతుల్యతను పాటించాలని సూచించింది. కానీ ఇది రిచా చద్దా లాంటి స్త్రీ వాదులకు ఎంతమాత్రం నచ్చడం లేదు. నోరా వాదనలను తప్పు పడుతున్నారు.
ఇద్దరు నటీనటులు కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. నోరా ఇటీవలే కునాల్ కెమ్ము దర్శకత్వం వహించిన తొలి మడ్గావ్ ఎక్స్‌ప్రెస్‌లో కనిపించగా, సంజయ్ లీలా భన్సాలీ 'హీరామండి'లో లజ్జో పాత్రలో రిచా నటించింది.