భారతదేశంలో అత్యంత ధనికుడైన దర్శకుడు?
అయితే వీరందరిలో ఎవరు అత్యంత ధనికుడైన దర్శకుడు? అంటే.. దానికి సమాధానం వీళ్లలో ఎవరూ కాదు.
By: Tupaki Desk | 30 Dec 2024 3:30 AM GMTభారతీయ సినీపరిశ్రమలో చరిత్రగతిని మార్చిన దిగ్ధర్శకులు ఎందరో ఉన్నారు. బ్లాక్ బస్టర్లు, సెన్సేషనల్ హిట్స్ తో పాటు, కళాత్మక చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకులున్నారు. దివంగత దర్శకుడు యష్ చోప్రా నుండి నేటితరంలో సిద్ధార్థ్ ఆనంద్ వరకూ చాలామంది రిచెస్ట్ ఫిలిండైరెక్టర్స్ బాలీవుడ్ లో ఉన్నారు. సంజయ్ లీలా భన్సాలీ, రాజ్ కుమార్ హిరాణి, సుభాష్ ఘయ్, రోహిత్ శెట్టి, విధు వినోద్ చోప్రా, ప్రియదర్శన్ ఇలా చాలామంది ఫేమస్ దర్శకులు ఉన్నారు. వీరంతా సీనియర్ ల జాబితాలో ఉన్నారు. అయితే వీరందరిలో ఎవరు అత్యంత ధనికుడైన దర్శకుడు? అంటే.. దానికి సమాధానం వీళ్లలో ఎవరూ కాదు.
అయితే ఆ దర్శకుడు ఎవరో ఊహించగలరా? అతడు షారుఖ్ ఖాన్‌తో కలిసి ఒక చిత్రంలో నటించాడు. నిరంతరం రియాలిటీ టీవీ షోతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. బాలీవుడ్‌లోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ అతడి సొంతం. ఈ వివరాలతో అయినా మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండొచ్చు. అతడు మరెవరో కాదు.. ది గ్రేట్ కరణ్ జోహార్. అతడు బాలీవుడ్ లో ఫేమస్ దర్శకుడు. అగ్రనిర్మాతగా బ్లాక్ బస్టర్లు తెరకెక్కించారు. బాలీవుడ్ లో సూపర్‌స్టార్లందరితో పని చేసాడు.
జాతీయ మీడియా కథనం ప్రకారం.. కరణ్ జోహార్ రూ.1700 కోట్ల నికర ఆస్తులతో బాలీవుడ్ దర్శకుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అతడి సొంత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ దశాబ్ధాలుగా పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను పరిశ్రమకు అందించింది. అతడు దశాబ్ధాలుగా హిందీ చిత్రసీమలో ప్రముఖ పంపిణీదారుడిగా ఉన్నారు. అలాగే కాస్టింగ్ ఏజెన్సీలను కరణ్ నిర్వహించారు. రియల్ వెంచర్లలోను పెట్టుబడులు పెట్టాడు. కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా, రకరకాల వ్యాపార మార్గాల్లో అతడు ఇంతటి సంపదను సృష్టించాడు.
కరణ్ జోహార్ తర్వాత రాజ్‌కుమార్ హిరాణీ అత్యంత ధనిక దర్శకుల్లో రెండో స్థానంలో ఉన్నారు. అతడి నికర ఆస్తుల విలువ రూ. 1300 కోట్లు. అలాగే కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మూడో స్థానంలో ఉన్నారు. అతడి నికర ఆస్తుల విలువ సమారు 940 కోట్లు. డార్క్ అండ్ బోల్డ్ సినిమాల దర్శకుడు అనురాగ్ కశ్యప్ 850 కోట్ల నికర ఆస్తులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ప్రముఖ రచయిత గుల్జార్ కుమార్తె, దర్శకురాలు మేఘనా గుల్జార్ నికర ఆస్తుల విలువ 830 కోట్లు.సల్మాన్ సన్నిహితుడైన కబీర్ ఖాన్ నికర ఆస్తులు 400కోట్లు. యాక్షన్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి రూ. 336 కోట్లు, అనురాగ్ బసు రూ. 330 కోట్లతో తరవాతి స్థానాల్లో ఉన్నారు. నేడు పాన్ ఇండియన్ సినిమాలతో సంచలనాలు సృష్టిస్తున్న టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి 158 కోట్ల మేర నికర ఆస్తులను కలిగి ఉన్నారని జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. 100 కోట్లు అంతకుమించిన నికర ఆస్తులు ఉన్న దర్శకులు డజను పైగానే ఉన్నారు.
ధనికుల్లో టాప్ 5 దర్శకుల జాబితా ఇలా ఉంది:
(2023లో నికర విలువ ప్రకారం)
*కరణ్ జోహార్ (నికర విలువ: రూ. 1500 కోట్లు) ...
*రాజ్‌కుమార్ హిరానీ (నికర విలువ: రూ. 1300 కోట్లు) ...
*సంజయ్ లీలా భన్సాలీ (నికర విలువ: రూ. 940 కోట్లు) ...
*అనురాగ్ కశ్యప్ (నికర విలువ: రూ. 850 కోట్లు) ...
*మేఘనా గుల్జార్ (నికర విలువ: రూ. 830 కోట్లు) ...