గ్లామర్ మాయలో రిద్ది క్యూట్ లుక్స్
ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమాలో కీలక పాత్రలో నటించి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
By: Tupaki Desk | 18 Nov 2024 9:30 PM GMTతెలుగులో రాజ్ తరుణ్ హీరోగా నటించిన లవర్ సినిమాతో పరిచయమైన నార్త్ ఇండియన్ బ్యూటీ రిధ్దీ కుమార్, మొదటి సినిమా నుంచే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి యావరేజ్ స్పందన పొందినప్పటికీ, రిధ్దీ కుమార్ తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమాలో కీలక పాత్రలో నటించి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
రెండు తెలుగు సినిమాల తరువాత రిధ్దీకు పెద్దగా బ్రేక్ దక్కకపోయినప్పటికీ, ఆమె పక్క ఇండస్ట్రీలలో అవకాశాలను చేజిక్కించుకుంది. తెలుగుతో పాటు మలయాళం, హిందీ సినిమాలలో కూడా నటిస్తూ తన పరిధిని విస్తరించుకుంది. అయితే, కమర్షియల్ హీరోయిన్గా అనుకున్న స్థాయిలో సక్సెస్‌ను అందుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజాసాబ్ సినిమాలో మూడో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా మీద రిధ్దీ భారీ ఆశలు పెట్టుకుంది.
సినిమాల కంటే ఎక్కువగా, రిధ్దీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పాపులారిటీని అందుకుంటోంది. ఇటీవల ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ముఖ్యంగా ఈ బ్లాక్ అండ్ గోల్డ్ అవుట్‌ఫిట్‌లో రిధ్దీ ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఫోటోలో ఆమె గోల్డ్ హల్టర్ టాప్ మరియు బ్లాక్ స్కర్ట్‌తో అద్భుతమైన లుక్‌లో మెరిసింది. స్టైలిష్ జ్యువెలరీతో కలగలిసిన ఆమె లుక్ గ్లామర్‌తో పాటు క్లాస్‌ను కూడా హైలైట్ చేస్తోంది.
ఈ ఫోటోలో కిచెన్ సెటప్‌లో పోజ్ ఇస్తూ, బోల్డ్ అండ్ కాజువల్ లుక్‌లో రిధ్దీ మరోసారి తన ఫ్యాషన్ సెన్స్‌కి న్యాయం చేస్తోంది. ఫ్యాన్స్ ఈ లుక్స్ చూసి మైమరిపోతున్నారు. ‘‘నిన్ను వెండితెరపై మరింత గ్లామరస్ పాత్రల్లో చూడాలని ఉంది’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోషూట్‌తో రిధ్దీ తన అందాన్ని హైలైట్ చేస్తూ, టాలీవుడ్లో మరిన్ని అవకాశాలను పొందడానికి ప్రయత్నిస్తోంది. మరి అమ్మడి లక్కు ఏమైనా మారితుందో లేదో చూడాలి.