Begin typing your search above and press return to search.

వీడియో: ముకేష్‌-నీతా అంబానీ జంట డ్యాన్సులు

ఈ ప్రీవెడ్డింగ్ పార్టీలో పాప్ స్టార్ రిహన్న డ్యాన్సింగ్ షో ప్రధాన హైలైట్‌లలో ఒకటి.

By:  Tupaki Desk   |   2 March 2024 9:00 AM GMT
వీడియో: ముకేష్‌-నీతా అంబానీ జంట డ్యాన్సులు
X

గుజరాత్‌ జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ అధికారికంగా తమ వివాహానికి ముందు వేడుకలను మార్చి 1 శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ ప్రీవెడ్డింగ్ పార్టీలో పాప్ స్టార్ రిహన్న డ్యాన్సింగ్ షో ప్రధాన హైలైట్‌లలో ఒకటి. రిహాన్న షోకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రిహన్నా సీ-త్రూ, నియాన్-గ్రీన్, మిరుమిట్లు గొలిపే దుస్తులను ధరించి వేదిక‌పై క‌నిపించ‌గా ఈ డ్రెస్ కి కాంబినేష‌న్ గా ఎరుపు రంగు కేప్‌ని జోడించి ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించింది. ఒక ఫోటోలో కాబోయే వరుడు అనంత్ అంబానీతో కలిసి రిహాన్న‌ వేదికపై కనిపించింది. ఇషా అంబానీ, ఆమె కోడలు శ్లోకా మెహతా, పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ వేదిక‌పై క‌నిపించారు. ఇక ఇదే వేదిక‌పై భార్య నీతా అంబానీతో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు. ఇద్దరు 1955ల్లో వచ్చిన బాలీవుడ్ లెజెండ్ రాజ్‌కపూర్ సినిమాలోని మెలోడీ సాంగ్ - ప్యార్ హువా ఇక్రార్ హువా హై పాటకు డ్యాన్స్ రీహార్సల్ చేస్తూ కనిపించారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది పాత వీడియోనా లేదా రిహానాతో క‌లిసి చేసినదా అనేదానిపై స్పష్టత లేదు. ఇక‌పోతే లైవ్ ఈవెంట్లో అంబానీ కుటుంబంలోని ప్రతి సభ్యునితో రిహానా స్టెప్పులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ప్ర‌స్తుతం అంబానీ దంప‌తుల డ్యాన్సుల‌కు సంబంధించిన వీడియోలు ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్‌ సహా పలువురు ప్రముఖులు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ కి హాజరయ్యారు. మనీష్ మల్హోత్రా, జాన్వీ కపూర్, మానుషి చిల్లర్ మరియు రాణి ముఖర్జీ కూడా ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం జామ్‌నగర్‌లో ఉన్నారు. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. భర్త రణబీర్ కపూర్ అత్తగారు నీతూ కపూర్‌తో పాటు అలియా భట్ కూడా ఈ భారీ వేడుకకు హాజరయ్యారు.

మార్చి 1-3 ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్ కి 1వ రోజు యాన్ ఈవినింగ్ ఇన్ ఎవర్‌ల్యాండ్ అని పేరు పెట్టారు. ట్రెండీ వేషధారణల‌తో అతిథులు హాజ‌రు కాగా.. సొగసైన కాక్‌టెయిల్ అంటూ ఈ పార్టీని అభివ‌ర్ణించారు. ఎ వాక్ ఆన్ ది వైల్డ్‌సైడ్ 2వ రోజు సంద‌డి గురించి అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. రెండో రోజు ఈవెంట్ కి `జంగిల్ ఫీవర్` అనేది వేషధారణ. చివరి రోజు కూడా రెండు కార్యక్రమాలు జరగనున్నాయి. మొదటిది, టస్కర్ ట్రయల్స్ `సాధారణం చిక్ లుక్` వస్త్రధారణతో అంద‌రూ వేడుక‌కు రావాలి. ఎందుకంటే సందర్శకులు జామ్‌నగర్ పచ్చని వాతావరణంలో షికార్ చేయాల్సి ఉంటుంది. హస్తాక్షర్.. ఈవెంట్లో చివరి పార్టీ. సాంప్రదాయ భారతీయ వస్త్రధారణలో ఒక సొగసైన సాయంత్రం కావాలని అంబానీ కుటుంబం దీనిని ప్లాన్ చేసింది. పెళ్లి బాజాల‌తో చివ‌రి రోజు వేడుక ముగుస్తుంది.