నేనెవరినీ అవకాశాలు అడుక్కోనన్న నటి
అయితే తనకు అవకాశాలు రాలేదు కదా అని ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ ఎవరినీ అడగలేనని రిమ్మీ సేన్ తాజా ఇంటర్వ్యూలో అన్నారు.
By: Tupaki Desk | 25 Jun 2024 8:59 AM GMTమెగాస్టార్ `అందరివాడు` చిత్రంలో నటించింది రిమ్మీ సేన్. తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత హిందీ చిత్రసీమలోను కొనసాగింది. 2003లో `హంగామా` సినిమాతో హిందీలో అరంగేట్రం చేసిన రిమ్మీ సేన్ హాస్య చిత్రాలతో విసిగిపోయి సినిమాలకు దూరంగా ఉన్నట్లు వెల్లడించింది. అప్పట్లో నేను హాస్య చిత్రాల్లో నటించాను...ఇలాంటి సినిమాల్లో నాకు పెద్దగా పాత్ర ఉండేది కాదు. హంగామా, జానీ గద్దర్ (2007) వంటి కొన్నింటిలో మాత్రమే మంచి పాత్రలో అవకాశం వచ్చింది. జానీ గద్దర్ పెద్దగా ఆడలేదు.. అని తెలిపింది. ఆ తర్వాత తనకు అలాంటి నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో అవకాశాలు రాలేదని తెలిపింది.
అయితే తనకు అవకాశాలు రాలేదు కదా అని ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ ఎవరినీ అడగలేనని రిమ్మీ సేన్ తాజా ఇంటర్వ్యూలో అన్నారు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్లతో కలిసి పనిచేసినప్పటికీ తనకు చిత్ర పరిశ్రమలో ఎవరూ కనెక్ట్ కాలేదని.. సహాయం కోసం ఎవరినీ అభ్యర్థించలేనని పేర్కొంది.
అయినా ఇతరులు తమ స్వలాభం కోసం ఎందుకు వెతకరు? ఎవరికైనా సహాయం చేయడానికి ఎవరైనా ఎందుకు ముందుకు వస్తారు? అంటూ రిమ్మీ సేన్ ఎదురు ప్రశ్నించింది. అలాగే వేరొక నటితో తన అవకాశాన్ని భర్తీ చేసారా? అన్న ప్రశ్నకు జవాబిచ్చింది. ఈ పరిశ్రమలో షేరింగ్ నిజంగా ఎక్కువ. టాలెంట్ అనేది ఆ తర్వాతి సంగతి. మీరు మొదట ఇక్కడి వ్యక్తులను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి. లేకపోతే, కుచ్ నహీం హో సక్తా, టాలెంట్ పదా రహేగా స్టోర్ రూమ్ మే... ముఝే నహీం ఆతా థా బెచ్నా, PR కర్నా.. అని వ్యాఖ్యానించింది.