Begin typing your search above and press return to search.

కాంతారాతో భళ్లాలదేవ.. వర్త్ వాచ్ ఎపిసోడ్ లోడింగ్..!

అంతకుముందు ఆయన కేవలం ఒక మళయాల హీరో దర్శకుడు కానీ కాంతారా సినిమా తర్వాత అతను పాన్ ఇండియా దర్శకుడు, నటుడు.

By:  Tupaki Desk   |   18 Dec 2024 9:36 AM GMT
కాంతారాతో భళ్లాలదేవ.. వర్త్ వాచ్ ఎపిసోడ్ లోడింగ్..!
X

అంతకుముందు ఆయన కేవలం ఒక మళయాల హీరో దర్శకుడు కానీ కాంతారా సినిమా తర్వాత అతను పాన్ ఇండియా దర్శకుడు, నటుడు. ఆ సినిమాతో నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న రిషబ్ శెట్టి కాంతారా ఫ్యాన్స్ ని మరోసారి థ్రిల్ చేసేందుకు కాంతరా ప్రీక్వెల్ తో రాబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ కాంతారా ఇయర్ గా మార్చేందుకు మరోసారి తన క్రియేటివిటీ చూపించబోతున్నారు రిషబ్ శెట్టి.

రిషబ్ శెట్టి ఓ క్రియెటివ్ జీనియస్.. నటుడిగానే కాదు దర్శకుడిగా ఆయన చేస్తున్న సినిమాలు మళయాళ పరిశ్రమ రేంజ్ పెంచుతున్నాయి. ఐతే ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది.. ఆయన ఎలా పనిచేస్తారు. అసలు సినిమా గురించి రిషబ్ శెట్టి ఫస్ట్ మూవ్ ఏంటి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఆ ప్రశ్నలకు ఆన్సర్ రాబట్టేలా రానా దగ్గుబాటి షో తో రానా రిషబ్ శెట్టితో స్పెషల్ చిట్ చాట్ చేశాడు.

అందరు సినిమాలు తీయాలంటే సిటీకి వెల్తారు. కానీ రిషబ్ మాత్రం తాను ఉంటున్న ఊరిలోనే సినిమాలు చేస్తాడు. అదే ఆయన స్పెషాలిటీ. రిషబ్ శెట్టి తో రానా దగ్గుబాటి స్పెషల్ ఎపిసోడ్ త్వరలో రాబోతుంది. దీనికి సంబందించిన ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో రిషబ్ శెట్టికి రానా తెలుగు నేర్పిస్తుండగా.. రానాకు కన్నడ మాస్ డైలాగ్ ని నేర్పిస్తున్నాడు రిషబ్.

ఇక రిషబ్ వైఫ్ ని ఆయనతో ప్రేమలో ఎలా పడ్డారన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి కాంతారాతో భళ్లాదేవ స్పెషల్ ఇంటర్వ్యూ అదే రానా దగ్గుబాటి షోలో రిషబ్ శెట్టి స్పెషల్ ప్రోమో ఆసక్తికరంగా ఉంది. ఈ ఎపిసోడ్ అటు మళయాళంలోని రిషబ్ ఫ్యాన్స్ కే కాదు సౌత్ ఇండస్ట్రీ మొత్తం ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ని కూడా అలరించేలా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రతి శనివారం రానా దగ్గుబాటి షో కొత్త ఎపిసోడ్ వస్తుంది. తప్పకుండా ఫ్యాన్స్ కి ఈ స్పెషల్ చిట్ చాట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని చెప్పొచ్చు. రిషబ్ శెట్టితో రానా చిట్ చాట్ లో ఆయన చేస్తున్నా చేయాలనుకుంటున్న సినిమాలతో పాటు తెలుగు నుంచి వచ్చిన ఆఫర్ల గురించి కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ కోసం తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.