ఆ రోజు రష్మిక పెళ్లిని వదులుకోకపోతే?
2016లో `కిరిక్ పార్టీ`తో కన్నడ సినీపరిశ్రమకు పరిచయమైన రష్మిక మందన్న తన తొలి చిత్ర కథానాయకుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడ్డారు.
By: Tupaki Desk | 6 Jan 2025 3:49 AM GMTఅవును.. ఆరోజు నిశ్చితార్థం అయిన కథానాయిక, పెళ్లితో కెరీర్‌ని ముగించి ఉంటే ఇంతటి చరిత్ర ఉండేదా? నేషనల్ క్రష్‌గా ప్రజల నుంచి నీరాజనాలు అందుకుని ఉండేదా? పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు దక్కేదా? అసలు ఛాన్సే లేదు. సినీప్రపంచంలో మ్యారీడ్ హీరోయిన్లకు నో ఛాన్స్. కారణం ఏదైనా రష్మిక మందన్న తన కెరీర్ కోసం తీసుకున్న గేమ్ ఛేంజింగ్ డెసిషన్ ఎప్పటికీ చర్చల్లో నిలుస్తుంది.
2016లో `కిరిక్ పార్టీ`తో కన్నడ సినీపరిశ్రమకు పరిచయమైన రష్మిక మందన్న తన తొలి చిత్ర కథానాయకుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఆ ఇద్దరికీ నిశ్చితార్థం అయింది. కానీ రష్మిక తన కెరీర్ కోసం అతడిని వదులుకుంది. పెళ్లిని రద్దు చేసుకుంది. తెలుగులో `ఛలో` చిత్రంలో అవకాశం అందుకుంది. ఆ సినిమాతో హిట్టందుకుని, తర్వాత టాలీవుడ్ అగ్ర కథానాయికగా ఎదిగేసింది. ఇప్పుడు నేషనల్ క్రష్ గా, జాతీయ స్థాయిలో హవా సాగిస్తోంది. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో రష్మిక రేంజ్ ఏ స్థాయికి చేరుకుందో చూస్తున్నదే. పుష్ప 2, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో రష్మిక పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది.
కిరిక్ పార్టీ విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ సినిమాని నిర్మించిన రిషబ్ శెట్టి తన సోదరుడు, చిత్రకథానాయకుడైన రక్షిత్ శెట్టి పేరును మాత్రమే ప్రస్థావిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడా తాను రాసిన సోషల్ మీడియా నోట్ లో రష్మిక పేరును ప్రస్థావించకపోవడం చర్చకు వచ్చింది. తన సోదరుడిని రష్మిక మోసం చేసిందనే అభిప్రాయం రక్షిత్ శెట్టికి ఉందా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. X లో రిషబ్ శెట్టి పోస్ట్ ఇలా ఉంది. ``8 సంవత్సరాల క్రితం హృదయాలను తాకిన... లెక్కలేనన్ని జ్ఞాపకాలను సృష్టించిన ప్రయాణం ప్రారంభమైంది. కిరిక్ పార్టీని చాలా ప్రత్యేకం చేసిన మీ ప్రేమ- మద్దతుకు ధన్యవాదాలు. రక్షిత్... ఈ మరపురాని ప్రయాణానికి చాలా ధన్యవాదాలు`` అని రాసారు. అయితే ఈ నోట్‌లో ఎక్కడా రష్మిక మందన్న పేరును ప్రస్థావించలేదు. ఉద్ధేశపూర్వకంగానే రష్మికను విస్మరించాడని నెటిజనులు గుర్తించారు. రక్షిత్ శెట్టి ప్రస్తుతం కన్నడ సినీరంగంలో ప్రతిభావంతుడైన నటుడు. తన సోదరుడు రిషబ్ శెట్టి పెద్ద దర్శకనిర్మాత కం నటుడు అన్న సంగతి తెలిసిందే. ఆరోజు రష్మిక ఆ పెళ్లిని రద్దు చేసుకోకపోయి ఉంటే, ఈ రోజు ఇంత పెద్ద స్టార్ అయ్యే అకాశాన్ని కోల్పోయి ఉండేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.