ఆయన యుద్దం కత్తి యుద్దాలకే తలమానికం
ఆయన స్వీయా దర్శకత్వంలో రిలీజ్ అయిన కాంతార పాన్ ఇండియాలో సంచలనం విజయం సాధించడంతో ప్రీక్వెల్ గా తీసుకొస్తున్న కాంతార-2 కోసం రిషబ్ శెట్టి ఎక్కడా రాజీ పడడం లేదు.
By: Tupaki Desk | 29 Jan 2025 8:47 AM GMTసినిమా కోసం నటులెంతగా కష్టపడతారు అన్నది వాళ్లను దగ్గర నుంచి చూసిన వాళ్లకే తెలుస్తోంది. సన్నివేశాల కోసం ఎక్కడా కాంప్రమైజ్ కారు. దర్శకుడికి ది బెస్ట్ ఇవ్వడం కోసం...ప్రేక్షకులకు వినోదంలో డబుల్ కిక్ అందిం చడం కోసం రాజీలేని పోరాటం చేస్తుంటారు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ సినిమాలపై వాళ్లంతా ఎంతో ఫ్యాషన్ తో శ్రమిస్తుంటారు. ఒక్క సీన్ కోసం వందల సార్లు ప్రాక్టీస్..రిహార్సల్స్ చేసి కెమెరా ముందుకొస్తుంటారు.
తాజాగా రిషబ్ శెట్టి `కాంతార-2` కోసం అలాగే శ్రమిస్తున్నాడు. ఆయన స్వీయా దర్శకత్వంలో రిలీజ్ అయిన కాంతార పాన్ ఇండియాలో సంచలనం విజయం సాధించడంతో ప్రీక్వెల్ గా తీసుకొస్తున్న కాంతార-2 కోసం రిషబ్ శెట్టి ఎక్కడా రాజీ పడడం లేదు. స్క్రిప్ట్ పై ఎంతో వర్క్ చేసి పట్టాలెక్కించిన ప్రాజెక్ట్ ఇది. కాంతార ముందుకు కథని రెండవ భాగంలో చెప్పబోతున్నాడు. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి మరింత పురాతన కాలానికి వెళ్లి కథని సిద్దం చేసాడు.
ఇక షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ సన్నివేశాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఓవైపు డైరెక్టర్ చేస్తూ మరోవైపు నటించడం అన్నది చిన్న విషయం కాదు. ఎంతో అనుభవం ఉంటే తప్ప సాధ్యం కానిది. కాంతార-2 కోసం ఇప్పుడలాగే శ్రమిస్తున్నాడు. తాజాగా ఓ యాక్షన్ సన్నివేశం కోసం ఆఫ్ ది స్క్రీన్ అతడు పెట్టిన ఎఫెర్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఒకేసారి గుర్రపుస్వారి, కత్తి యుద్దంపై ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడుట.
ట్రైనర్ల ఆధ్వర్యంలో శిక్షణ ముగించిన అనంతరం కొన్ని గంటల పాటు దానిపై ప్రాక్టీస్ చేస్తున్నాడట. సాధారణ కత్తి యుద్దం కాదని.... కత్తి యుద్దంలోనే ఓ ప్రత్యేకత ఉండేలా యుద్ద సన్నివేశాలుంటాయని అందుకు తగ్గట్టు రిషబ్ తనని తాను మలుచుకుంటున్నాడట. అలాగే రన్నింగ్ గుర్రాలతో స్వారీ చేసి వాటిని లొంగదీసుకునే సన్నివేశాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నాడట. సినిమాలో ఈ సన్నివేశాలు ఎంతో రియలిస్టిక్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తాయని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇంతలో, `కాంతారా 2` ఈ సంవత్సరం అక్టోబర్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నారు.