Begin typing your search above and press return to search.

'కాంతార 1' లో సూపర్‌ స్టార్‌..!

కన్నడ బ్లాక్ బస్టర్‌ కాంతార సినిమాకు ప్రస్తుతం ప్రీక్వెల్‌ రూపొందుతున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   1 Oct 2024 8:32 AM GMT
కాంతార 1 లో సూపర్‌ స్టార్‌..!
X

కన్నడ బ్లాక్ బస్టర్‌ కాంతార సినిమాకు ప్రస్తుతం ప్రీక్వెల్‌ రూపొందుతున్న విషయం తెల్సిందే. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన కాంతార సినిమా ఏకంగా రూ.450 కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కాంతార అంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రేక్షకుల కోసం రిషబ్‌ శెట్టి మరోసారి కాంతార ను తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. కాంతార సీక్వెల్‌ కంటే ప్రీక్వెల్‌ చేయడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చిన రిషబ్‌ శెట్టి ఇటీవలే ప్రీక్వెల్‌ ను మొదలు పెట్టిన విషయం తెల్సిందే.

కాంతార సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కాంతార చాప్టర్‌ 1 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. కాంతార చాప్టర్ 1 లో ఇంతకు ముందు వచ్చిన కాంతార సినిమాలో చూపించిన కథకు ముందుగా ఏం జరిగింది అనే విషయాలను చూపించబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న కాంతార చాప్టర్ 1 ను భారీ తారాగణంతో దర్శకుడు రిషబ్ శెట్టి రూపొందిస్తున్నాడు.

కాంతార సినిమాలో ఒక మోస్తరు నటీనటులు మాత్రమే నటించారు. కానీ ప్రీక్వెల్‌ లో మాత్రం భారీ తారాగణం నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్‌ ను కీలక పాత్ర కోసం కాంతార టీం సంప్రదించిందని, త్వరలోనే ఆయన సినిమా షూటింగ్‌ లో జాయిన్ అవుతాడని కాంతార మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది. కాంతార సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందిన కాంతార సినిమా లో రిషబ్ శెట్టి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ప్రస్తుతం రూపొందుతున్న కాంతార ప్రీక్వెల్‌ లోనూ రిషబ్‌ శెట్టి పాత్ర అత్యంత విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రిషబ్ శెట్టి పోషించే పాత్రకు మోహన్ లాల్‌ తండ్రి గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరి కాంబోలో వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. వంద కోట్లకు పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి పార్ట్‌ రూ.450 కోట్ల వసూళ్లు చేసిన నేపథ్యంలో, వచ్చే ఏడాది రాబోతున్న కాంతార ప్రీక్వెల్‌ కి వెయ్యి కోట్ల వసూళ్లు ఖాయం అనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.