నీతులు...సూక్తులు కొందరికేనా? మీకు వర్తించవా?
టాలీవుడ్, శాండిల్ వుడ్ అంటే పాన్ ఇండియాలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
By: Tupaki Desk | 5 Dec 2024 3:30 PM GMTటాలీవుడ్, శాండిల్ వుడ్ అంటే పాన్ ఇండియాలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. టాలీవుడ్ నుంచి `బాహుబలి`, శాండిల్ వుడ్ నుంచి `కేజీఎఫ్` చిత్రాలు ఆ రకమైన ఐడెంటిటీకి పునాది వేసాయి. అటుపై ఆ రెండు పరిశ్రమలు పాన్ ఇండియా లో ఆ క్రేజ్ ని రెట్టింపు చేసాయి. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలు ఇక్కడ నుంచి బాలీవుడ్ కి వెళ్లి సినిమాలు చేయడం మొదలు పెట్టారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా వీళ్లంతా తెలుగుతో పాటు హిందీలోనూ పని చేస్తున్న హీరోలే.
అయితే యష్..మహేష్ మాత్రం వీళ్లకు భిన్నంగా ప్రయాణం సాగిస్తున్నారు. మనం అక్కడికి వెళ్లడం కాదు..వాళ్లనే ఇక్కడికి రప్పింద్దాం అన్న తరహాలో ముందుకెళ్తున్నారు. ఇటీవలే యష్ కన్నడలో మాత్రమే సినిమాలు చేస్తానని తేల్చిచెప్పాడు. మహేష్ కి కూడా బాలీవుడ్ కి వెళ్లనని..తాను చేయాల్సిన ప్రయోగాలన్నీ టాలీవుడ్ లో ఉండే చేస్తా నన్నారు. ఇదే తరహాలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.
అందరూ కన్నడ సినిమాలు వదిలి బయటకు వెళ్తున్నారు. కానీ తాను అలా కాదన్నారు. కానీ ఇప్పుడు రిషబ్ శెట్టి రూట్ మార్చి తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న` జైహమనుమాన్` లో నటిస్తున్నాడు. బాలీవుడ్ లో `ది చత్రపతి శివాజీ` సినిమా చేస్తున్నాడు. దీంతో రిషబ్ శెట్టి నెటి జనులకు అడ్డంగా దొరికినట్లు అయింది. ఆయన మాత్రం హిందీలో సినిమాలు చేయోచ్చు...ఇతరులు మాత్రం చేయకూడదా?
నీతలు..సూక్తులు ఆయనకు వర్తించవా? ఇతర దర్శకులకు, హీరోలకు మాత్రమే వర్తిస్తాయా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి వీటిపై రిషబ్ శెట్టి రియాక్షన్ ఎలా ఉంటుంది? అన్నది చూడాలి. ప్రస్తుతం ఆయన `కాంతార` ప్రీక్వెల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.