Begin typing your search above and press return to search.

500 మంది ఫైట‌ర్ల‌తో భారీ వార్! లొకేష‌న్ ఎక్క‌డ‌?

ఓవైపు డైరెక్ట్ చేస్తూ మ‌రోవైపు న‌టించ‌డం అన్న‌ది చిన్న విష‌యం కాదు.

By:  Tupaki Desk   |   6 Feb 2025 6:56 AM GMT
500 మంది ఫైట‌ర్ల‌తో భారీ వార్! లొకేష‌న్ ఎక్క‌డ‌?
X

క‌న్న‌డ న‌టుడు రిష‌బ్ శెట్టి స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియాలో 'కాంతార' కి ప్రీక్వెల్ గా 'కాంతార‌-2' తెర‌కె క్కుతోన్న సంగ‌తి తె లిసిందే. భారీ కాన్సాస్ పై చిత్రాన్ని హోంబ‌లే ఫిల్స్మ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. షూటింగ్ మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ స‌న్నివేశాల విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. ఓవైపు డైరెక్ట్ చేస్తూ మ‌రోవైపు న‌టించ‌డం అన్న‌ది చిన్న విష‌యం కాదు. ఎంతో అనుభ‌వం ఉంటే త‌ప్ప సాధ్యం కానిది.

'కాంతార‌-2' కోసం ఇప్పుడ‌లాగే శ్ర‌మిస్తున్నాడు రిష‌బ్. ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం ఆఫ్ ది స్క్రీన్ లో రిష‌బ్ క‌ఠోర‌మైన శిక్ష‌ణ సైతం తీసుకున్నాడు. ఒకేసారి క‌ల‌రియ‌ప‌ట్టు, గుర్ర‌పుస్వారి, క‌త్తి యుద్దంపై ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకున్నాడు. ప్ర‌త్యేక ట్రైన‌ర్ల ఆధ్వ‌ర్యంలో ఈ శిక్ష‌ణ ముగించాడు. తాజాగా ఈ యాక్ష‌న్ స‌న్నివేశం చిత్రీక‌ర‌ణ‌కు రిష‌బ్ సిద్ద‌మ వుతున్నాడు. ఇది భారీ వార్ సీక్వెన్స్ అని తెలుస్తోంది. ఈ స‌న్నివేశ 500 మంది ఫైట‌ర్లతో చిత్రీక‌రించ‌డానికి రెడీ అవుతున్నారు.

వీరంతా నైపుణ్యం గ‌ల ఫైట‌ర్లు. అంద‌రికీ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీలో అపార అనుభ‌వం ఉంది. ఓభారీ లోకేష‌న్ లో ఈ వార్ స‌న్నివేశాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. అయితే ఆ లోకేష‌న్ వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. 500 మందితో వార్ స‌న్నివేశం అంటే? బాహుబ‌లి లో కాల‌కేయ‌- బాహుబ‌లి బృందానికి మ‌ధ్య జ‌రిగే భారీ వార్ సీన్ లాగే ఉంటుం దేమో ఈ స‌న్నివేశం. సినిమా మొత్తానికి ఈ స‌న్నివేశం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చిత్ర బృందం చెబుతోంది.

ప్ర‌స్తుతం టీమ్ ఈ వార్ సీక్వెన్స్ చిత్రీక‌ర‌ణ కోసం స‌ర్వం సిద్దం చేస్తోంది. అవ‌స‌ర‌మైన ఆయుధాలు, భారీ ఎక్విప్ మెంట్స్ అన్నింటిని రెడీ చేస్తోంది. ఈ వార్ సీక్వెన్స్ పూర్తి చేస్తే స‌గ భాగం షూటింగ్ పూర్త‌యిన‌ట్లే అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ తేదీని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అక్టోబర్ 2న విడుదల చేస్తున్న‌ట్లు రివీల్ చేసారు.