కాంతార హీరో - ప్రభాస్.. మ్యాటరెంటీ?
అయితే, ప్రభాస్ కోసం కథలు వెతుకుతున్న క్రమంలో రిషబ్, డార్లింగ్ కి సుటయ్యే ఒక పవర్ఫుల్ కథను ఇటీవల మేకర్స్ కి వినిపించారట.
By: Tupaki Desk | 9 Dec 2024 11:30 AM GMTపాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పవర్ఫుల్ లైనప్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎలాంటి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా బడ్జెట్ లెక్కలు మినిమమ్ 350 కోట్లకు తక్కువ ఉండడం లేదు. ప్రభాస్ స్టార్ ఇమేజ్ మీద ప్రస్తుతం ఇండస్ట్రీలో 2 వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నాయంటే అతని క్రేజ్ ఏ స్తాయిల్ప్ ఉందొ అర్థం చేసుకోవచ్చు. సలార్ 2, కల్కి 2 అలాగే రాజా సాబ్ సినిమాలు ప్రస్తుతం లైనప్ లో ఉన్నాయి. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో "ఫౌజీ" షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
ముందుగా "ది రాజా సాబ్" సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో "స్పిరిట్" కోసం సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఇంతకు ముందు సలార్ తో భారీ విజయాన్ని అందుకున్న హోంబాలే ఫిలిమ్స్, ప్రభాస్ తో మరో మూడు పాన్ ఇండియా ప్రాజెక్టులను ప్రకటించడం ద్వారా అందరిలో ఆసక్తిని పెంచింది. ఇందులో ఇప్పటికే "సలార్ 2" ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.
ఇక మిగిలిన రెండు ప్రాజెక్టులపై ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ప్రస్తుతం హోంబాలే ఫిలిమ్స్ లో "కాంతార 2" మీద పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ప్రభాస్ కోసం కథలు వెతుకుతున్న క్రమంలో రిషబ్, డార్లింగ్ కి సుటయ్యే ఒక పవర్ఫుల్ కథను ఇటీవల మేకర్స్ కి వినిపించారట. ఇది ప్రభాస్ కెరీర్ లో ఒక విభిన్న చాప్టర్ అవుతుందని భావిస్తున్నారు.
అయితే ఈ ప్రాజెక్టుకు దర్శకత్వ బాధ్యతలు ఎవరిది అనేది ఇంకా స్పష్టత రాలేదు. ముందుగా ప్రశాంత్ వర్మ, లోకేష్ కనగరాజ్ అనే పేర్లు వినిపించినప్పటికీ, అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. మరోవైపు, రిషబ్ శెట్టి ఇప్పటికే "జై హనుమాన్", "ఛత్రపతి వీరశివాజీ" సినిమాలకు అఫీషియల్ గా ఓకే చెప్పారు. టాలీవుడ్ లో మరో ప్రాజెక్టుపై కూడా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ డిటైల్స్ ప్రభాస్ అభిమానులను మరింత ఉత్సాహపరుస్తున్నాయి.
ప్రభాస్ రాబోయే ప్రాజెక్టులలో సలార్ 2 మరియు కల్కి 2898 ఏడి సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. "కల్కి 2" వచ్చే ఏడాది లేదా ఆ సంవత్సరం చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టు యొక్క విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు. ఇక ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న అన్ని ప్రాజెక్టులూ భారీ బడ్జెట్ తో రూపొందుతుండటంతో, వీటి ప్రభావం టాలీవుడ్ మరియు పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
ఇదిలా ఉండగా, ప్రభాస్ తీరిక లేకుండా ప్రాజెక్ట్ లను సెట్ చేసుకుంటున్నప్పటికి, ఏ ఒక్క ప్రాజెక్ట్ పై కూడా తన ఫోకస్ ను తగ్గించకుండా ముందుకు సాగడం ఫ్యాన్స్ లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏ ప్రాజెక్టు అయినా అభిమానుల అంచనాలను అందుకునేలా ఉంటుందని చెప్పవచ్చు. ప్రభాస్ దూకుడు చూస్తుంటే, రాబోయే రోజుల్లో ప్రతీ ఏడాదికి రెండు సినిమాలతో సర్ ప్రైజ్ చేస్తాడని అనిపిస్తోంది.