Begin typing your search above and press return to search.

రిషబ్ శెట్టి కామెంట్స్ వాళ్లకు గట్టిగా తగులుతున్నాయ్..

అంతేకాదు తనకు ఇంత సక్సెస్ ఇచ్చిన కన్నడ సినిమాను వదిలి వెళ్లనని అన్నారు రిషబ్ శెట్టి. ఒక్క హిట్ పడగానే అందరిలా కన్నడ పరిశ్రమ వదిలి వెళ్లనని అన్నారు

By:  Tupaki Desk   |   30 Nov 2023 12:30 AM GMT
రిషబ్ శెట్టి కామెంట్స్ వాళ్లకు గట్టిగా తగులుతున్నాయ్..
X

కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి లేటెస్ట్ కామెంట్స్ కన్నడ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుని వేరే భాషలకు వెళ్లిన వారికి గట్టిగా తగులుతున్నాయి. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో పాల్గొన్న రిషబ్ శెట్టి కన్నడ ప్రేక్షకులు ఆదరించారు కాబట్టే కాంతార మొదట సూపర్ హిట్ అయ్యిందని ఆ తర్వాత అన్ని భాషల్లో అది రిలీజైందని అన్నారు.

అంతేకాదు తనకు ఇంత సక్సెస్ ఇచ్చిన కన్నడ సినిమాను వదిలి వెళ్లనని అన్నారు రిషబ్ శెట్టి. ఒక్క హిట్ పడగానే అందరిలా కన్నడ పరిశ్రమ వదిలి వెళ్లనని అన్నారు. అయితే రిషబ్ చేసిన ఈ కామెంట్స్ కన్నడ నుంచి వచ్చి సౌత్ ఇండియాని షేక్ చేస్తున్న ఒక డైరెక్టర్, ఒక యాక్టర్ కి యాప్ట్ అవుతున్నాయి.

కన్నడ లో కె.జి.ఎఫ్ రెండు భాగాలు చేసి సంచలన విజయాలు అందుకున్న ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ 2 తర్వాత ప్రభాస్ తో సలార్, ఎన్.టి.ఆర్ మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. కన్నడ హీరోలతో చేయట్లేదనే ఆలోచన అక్కడ ఫ్యాన్స్ కి ఉంది. ఇక హీరోయిన్ రష్మిక మందన్న కూడా కిరాక్ పార్టీ హిట్ కాగానే తెలుగులో ఆఫర్ వచ్చింది. అక్కడ నుంచి టాలీవుడ్ కి వచ్చిన రష్మిక వరుస తెలుగు సినిమాలు చేస్తూ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది.

కన్నడలో హిట్ అందుకుని ఆ క్రేజ్ తో మిగతా పరిశ్రమల్లో సత్తా చాటుతున్నారు కొందరు. అయితే రిషబ్ శెట్టి మాత్రం తను అలా చేయనని కన్నడలోనే సినిమాలు చేస్తానని అన్నారు. కాంతార తర్వాత తనకు చాలా పెద్ద ఆఫర్లు వచ్చాయని కానీ తను ఇక్కడ మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యానని అన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న టైం లో రిషబ్ శెట్టి కేవలం కన్నడ లోనే సినిమాలు చేస్తానని చెప్పడం ఇబ్బంది కరంగా ఉన్నా మాతృ భాష మీద అతనికి ఉన్న గౌరవానికి ఆడియన్స్ సూపర్ అనేస్తున్నారు. ఇక కాంతార సినిమా విషయానికి వస్తే కాంతార ప్రీక్వెల్ గా కాంతార ది లెజెండ్ చాప్టర్ 1 వస్తుంది. ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కాంతార ప్రాక్వెల్ కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. కాంతార ప్రీక్వెల్ విషయంలో రిషబ్ శెట్టి ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.