'కల్కి' బుజ్జి తో కాంతార సరదా...!
అత్యాధునిక టెక్నాలజీ వినియోగించి కల్కి టీం తయారు చేసిన బుజ్జి కారును దేశ వ్యాప్తంగా అనేక ముఖ్య నగరాల్లో తిప్పుతూ సినిమా ప్రమోషన్ చేసిన విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 28 Jun 2024 7:35 AM GMTదేశవ్యాప్తంగా కల్కి ఫీవర్ కొనసాగుతోంది. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాకు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా దాదాపు రూ.650 కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మించారు. ఈ సినిమా కోసం తయారు చేసిన బుజ్జి కారు గురించి విడుదలకు ముందు భారీగా ప్రచారం చేశారు.
అత్యాధునిక టెక్నాలజీ వినియోగించి కల్కి టీం తయారు చేసిన బుజ్జి కారును దేశ వ్యాప్తంగా అనేక ముఖ్య నగరాల్లో తిప్పుతూ సినిమా ప్రమోషన్ చేసిన విషయం తెల్సిందే. తాజాగా బుజ్జి తో కాంతార హీరో రిషబ్ శెట్టి మరియు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. బుజ్జి కారులో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బుజ్జి కారు కి ఉన్న క్రేజ్ ఏంటో ఇప్పటికే అందరికీ అర్థం అయ్యింది. తాజాగా రిషబ్ శెట్టి కూడా కుటుంబ సమేతంగా బుజ్జి తో సరదాగా షికారు చేయడం తో సినిమాకు మరియు బుజ్జి కి మరింత పబ్లిసిటీ దక్కినట్లు అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.
ప్రభాస్ కల్కి సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. మొదటి వీకెండ్ పూర్తి అయ్యేప్పటికి ఈ సినిమా సాలిడ్ వసూళ్లను నమోదు చేయడం ఖాయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. దాదాపుగా రూ.500 కోట్ల షేర్ టార్గెట్ తో విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేసింది.
రాబోయే రెండు మూడు వారాల పాటు ఈ సినిమా కు పోటీ లేక పోవడం వల్ల కచ్చితంగా టాలీవుడ్ బాక్సాఫీస్ తో పాటు అన్ని బాక్సాఫీస్ ల వద్ద సందడి చేసే అవకాశాలు ఉన్నాయి. అమితాబచ్చన్, కమల్ హాసన్ ల పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షగా నిలవడంతో పాటు సినిమా కు అన్ని భాషల్లో కూడా మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టారు.