బాలీవుడ్ తో దేశ సంస్కృతి నాశనం - రిషబ్ శెట్టి
అలాగే ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ వేదికల మీద అవార్డులు అందుకొని సౌత్ సినిమాల గొప్పతనం ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేసింది.
By: Tupaki Desk | 21 Aug 2024 10:10 AM GMTఇండియన్ సినిమా అంటే మొదట వరల్డ్ వైడ్ గా వినిపించిన పేరు బాలీవుడ్. చాలా వరకు బాలీవుడ్ సినిమానే భారతీయ సినిమా అనే విధంగా అంతర్జాతీయ వేదికలపై ఇంతకాలం ప్రొజెక్ట్ చేశారు. అయితే ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రాంతీయ భాషల నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయనే విషయం బాహుబలి సిరీస్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. అలాగే ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ వేదికల మీద అవార్డులు అందుకొని సౌత్ సినిమాల గొప్పతనం ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేసింది.
ప్రస్తుతం సినిమాల బిజినెస్ పరంగా, బడ్జెట్ ల పరంగా చూసుకుంటే సౌత్ సినిమాలు డామినేటింగ్ గా ఉన్నాయి. సౌత్ దర్శకులు భారీ కథలని తెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే భారతీయ సంస్కృతి, నాగరికతని రిప్రజెంట్ చేసే కథలని తెరపై చూపిస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి ప్రయత్నం అస్సలు జరగడం లేదనేది చాలా మంది సినీ విశ్లేషకులు అంటున్న మాట. ఇదిలా ఉంటే కాంతారాతో అందరి దృష్టిని ఆకర్షించి నేషనల్ అవార్డు అందుకున్న రిషబ్ శెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మన చిత్రాలని గ్లోబల్ ఈవెంట్ లకి ఆహ్వానిస్తూ ఉంటారు. రెడ్ కార్పెట్ వేస్తారు. అయితే బాలీవుడ్ సినిమాలు కొన్ని భారతదేశాన్ని తక్కువ చేసి చూపిస్తాయి. మన నాగరికతని, సంస్కృతి అవమానించే విధంగా బాలీవుడ్ లో కొన్ని సినిమా కథలు ఉంటాయంటూ రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు. నేను మాత్రం నా దేశం, నా రాష్ట్రం, నా భాష గురించి గొప్పగా చెప్పాలని అనుకుంటున్నాను.
నా దేశం గురించి ప్రతి ఒక్కరు గర్వంగా మాట్లాడేలా చేయాలని అనుకుంటున్నాను. అందుకే అలాంటి కథలనే సినిమాలుగా చేస్తాను అంటూ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సౌత్ ఇండస్ట్రీకి చెందిన సినీ అభిమానులు సమర్థిస్తున్నారు. అయితే బాలీవుడ్ సినిమాలు ఇష్టపడేవారు మాత్రం రిషబ్ శెట్టిపై విమర్శలు చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్స్ అందరూ సౌత్ సినిమాల గురించి గొప్పగా చెబితే వారు బాలీవుడ్ సినిమాలని అవమానిస్తూ మాట్లాడుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి కాంతారా సినిమాలో హీరోయిన్ తో ఎంత అసభ్యంగా బిహేవ్ చేసాడో అని హైలెట్ చేస్తూ ఇందులో గొప్పతనం ఎక్కడ ఉందంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే రిషబ్ శెట్టి వ్యాఖ్యలపైన సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ లో కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.