Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ హౌస్ లోకి అందాల యాంకర్..

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో మళ్లీ వచ్చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 July 2024 6:51 AM GMT
బిగ్ బాస్ హౌస్ లోకి అందాల యాంకర్..
X

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో మళ్లీ వచ్చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తవ్వగా.. త్వరలోనే ఎనిమిదో సీజన్ స్టార్ట్ కానుంది. ఇటీవల సీజన్-8 లోగో ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కింగ్ నాగార్జున కూడా నెట్టింట షేర్ చేయడంతో ఆయనే మళ్లీ హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మొదలవుతుందని సమాచారం.


హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ ను కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి హౌస్‌ లోకి ఎవరు అడుగు పెట్టబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే పలువురు కంటస్టెంట్స్ ను లాక్ చేసినట్లు సమాచారం. వేణు స్వామి, నాయని పావని, జబర్దస్త్ అప్పారావు, కుమారి ఆంటీ, ఒక కపుల్ తోపాటు మరికొందరు పాల్గొనబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అందుకు సంబంధించి ఆమెకు పేమెంట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. దీంతో అమ్మడు కచ్చితంగా హౌస్ లోకి వెళ్తుందని సమాచారం. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. నెటిజన్లు స్పందిస్తున్నారు. అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెడితే రచ్చ రచ్చ చేయడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్.

పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ చౌదరి. ఆ తర్వాత పలు టీవీ షోల్లో పాల్గొంది. జబర్దస్త్ షోలో పార్టిసిపేట్ చేసి సూపర్ క్రేజ్ దక్కించుకుంది. దావత్ టాక్ షోకు హౌస్ట్ చేసి మరింత ఫేమస్ అయింది. తన యాంకరింగ్ తో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది. కొన్నిసార్లు బోల్డ్ గా మాట్లాడుతూ వైరల్ అవుతుంటుంది. ఎప్పటికప్పుడు ఆమె యాంకరింగ్ వీడియోస్ ట్రెండింగ్ లో ఉంటాయి.

ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రీతూ చౌదరి. అదిరిపోయే ఔట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తుంటుంది. పొట్టి డ్రెస్సుల్లో స్కిన్ షో చేస్తుంటుంది. చీరల్లో కూడా క్లీవేజ్ షోతో అట్రాక్ట్ చేస్తుంది. నడుము, నాభి అందాలతో కుర్రాళ్లను ఫ్లాట్ చేస్తుంది. థైస్ షోతో క్లీన్ బౌల్డ్ చేస్తుంది. అలా కుర్ర ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. మరి ఈ అమ్మడు.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి ఎలాంటి క్రేజ్ సంపాదించుకుంటుందో చూడాలి.