Begin typing your search above and press return to search.

హైపర్ ఆదినే కారణం.. రీతు షాకింగ్ కామెంట్స్..!

జబర్దస్త్ లో హైపర్ ఆది టీం లో ఎక్కువగా కనిపించిన తీరు చౌదరి ఆదితోనే కొన్నాళ్లు కలిసి స్కిట్స్ చేసింది

By:  Tupaki Desk   |   28 July 2024 2:30 AM GMT
హైపర్ ఆదినే కారణం.. రీతు షాకింగ్ కామెంట్స్..!
X

జబర్దస్త్ లో కొన్నాళ్లే చేసినా రీతు చౌదరి ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ లో హైపర్ ఆది టీం లో ఎక్కువగా కనిపించిన తీరు చౌదరి ఆదితోనే కొన్నాళ్లు కలిసి స్కిట్స్ చేసింది. ఐతే హైపర్ ఆది జబర్దస్త్ నుంచి బయటకు రావడంతో రీతు చౌదరి కూడా అక్కడ ఛాన్స్ కోల్పోయింది. తను జబర్దస్త్ వదిలేయడానికి కారణం హైపర్ ఆదినే అంటుంది రీతు చౌదరి. ఐతే అదేదో ఆమె ఒక కంప్లైంట్ లా కాకుండా ఆది తనను చాలా కేరింగ్ గా చూసుకునే వాడు. ఆయన టీం లో అయితేనే చేయాలని అనుకున్న ఆయన బయటకు రావడంతో తాను కూడా బయటకు వచ్చానని అన్నది రీతు చౌదరి.

జబర్దస్త్ ఫ్లాట్ ఫాం చాలామంది కమెడియన్స్ కు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఇంత పాపులర్ అయిన హైపర్ ఆది కూడా అదిరే అభి టీం ద్వారా వచ్చి అతని పంచులతో ప్రేక్షకులను అలరించి అతనొక టీం లీడర్ అయ్యాడు. జబర్దస్త్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చిన ఆది తన పంచులతో షోకి సూపర్ క్రేజ్ తెచ్చాడు. ఐతే జబర్దస్త్ తో పాటుగా ఢీ షోకి అతన్ని కొనసాగించగా రెండిటిని బ్యాలెన్స్ చేయడం కుదరక జబర్దస్త్ ని వదిలేశాడు.

ఐతే హైపర్ ఆది జబర్దస్త్ టీం గా చేస్తున్నప్పుడే అతనితో కలిసి రీతు చౌదరి అతని టీం లో చేసింది. అది జబర్దస్త్ నుంచి బయటకు రావడం వల్ల తను కూడా వచ్చేశానని అంటుంది రీతు. ప్రస్తుతం స్టార్ మాలో వస్తున్న కిరాక్ బాయ్స్.. ఖిలాడి గళ్స్ షోలో పాల్గొంటున్న రీతు ఈ షో ద్వారా మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది. జబర్దస్త్ షోతో ఐడెంటిటీ తెచ్చుకున్న రీతు ఆ పాపులారిటీతో ఇన్ స్టాగ్రాం లో రకరకాల ఫోటో షూట్ తో ఫాలోవర్స్ ని అలరించింది.

ఐతే తన ఫోటో షూట్స్.. తన గ్లామర్ అప్పీల్ చూసి సినిమాల్లో బోల్డ్ రోల్స్ వస్తున్నాయి. కాకపోతే తనకు పాత్ర ప్రాధాన్యత ఉంటే తప్ప అలా కనిపించాలని లేదని అందుకే ఒకటి రెండు ఆఫర్లు కూడా కాదన్నానని అంటుంది రీతు చౌదరి. బోల్డ్ గా కనిపించేందుకు రెడీనే కానీ క్యారెక్టర్ డిమాండ్ చేయాలని అంటుంది. మరి రీతు మాటలని బట్టి చూస్తే అమ్మడు గ్లామర్ షో చేసేందుకు సిద్ధమే అన్నట్టుగానే ఉంది.