నామీద ఎటాక్ చేస్తే కాపాడేది ఎవరు? అందుకే అలా!
జీవితంలో ఎప్పుడైనా ఊహించని విధంగా ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.
By: Tupaki Desk | 3 Oct 2024 3:00 AM GMT'గురు'తో టాలీవుడ్ కి పరిచయమైన రితికా సింగ్ సుపరిచితమే. అమ్మడు బాక్సర్ పాత్రతో ఆడియన్స్ ని ఎంతగానో మెప్పించింది. అటుపై మరికొన్ని సినిమాలు చేసి మరింత దగ్గరైంది. ప్రస్తుతం సౌత్ లో అన్ని భాషల్లోనూ నటిస్తోంది. ఇక రితికా సింగ్ మార్షల్ ఆర్స్ట్ లో ఆరితేరిన బ్యూటీ. తాజాగా మార్షల్ ఆర్స్ట్ గురించి కొన్ని విషయాలు పంచుకుంది. `చిత్ర పరిశ్రమల్లోనే కాదు. జీవితంలో ఎప్పుడైనా ఊహించని విధంగా ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.
దాన్నుంచి తప్పించుకోవడానికి మనం సిద్దంగా ఉండాలి. అందుకోసమే నేను బాక్సింగ్, కరాటే నేర్చుకున్నా. దానికి సంబంధించిన వీడియోలు తరుచూ షేర్ చేస్తుంటా. వాటిని చూసిన పలువురు వ్యక్తులు బాక్సింగ్ కరాటే వీడియోలు షేర్ చేయోద్దు. నెటి జనులు నిన్ను చూసి భయపడుతున్నారని చెప్పారు. నేను కేవలం ఫైట్ వీడియోలు మాత్రమే కాదు. సారీ ఫోటో షూట్ ..ఇతర దుస్తుల్లో ఉన్న వీడియోలు..ఫోటోలు షేర్ చేస్తుంటా.
`ఓమై కడవులే` వంటి ఫీల్ గుడ్ సినిమాలో నటించా.` కాలా పక్కారా` పాటకు డాన్సు చేసాను. నేను ఏదైనా చేయగలను అని ఇంకెలా చెప్పాలి. ఎవరో ఏదో అన్నారని అలాంటి వాటిని షేర్ చేయకుండా ఉండలేను. ట్రైనింగ్ తీసుకోవడం మానలేదు. ఎందుకంటే అది నాకెంతో ఇష్టమైన పని. ఇంత స్ట్రాంగ్ గా ఉండటం మంచిది కాదని చాలా మంది సలహాలు ఇస్తుంటారు. అలా ఎందుకు ఉండకూడదు? దుర దృష్టవశాత్తు ఎవరైనా ఏదైనా చేస్తే? అప్పుడు ఎవరు సాయం చేస్తారు? నన్ను నేరు రక్షించుకోవడానికి నాకంటూ కొన్ని బేసిక్స్ అయినా తెలిసి ఉండాలి.
అలాగని అందరూ మార్షల్ ఆర్స్ట్ కావాల్సిన పనిలేదు. కనీసం గళాన్ని అయినా బయటకు చెప్పే దైర్యం ఉండాలి. మన వాయిస్ ఓ ఆయుధం లాంటింది. ఎటాక్ చేయాల్సిన పనిలేదు. డిపెండ్ చేసుకోవాల్సి ఉంది` అని తెలిపింది. ఈ అమ్మడు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `వెట్టయాన్` లోనూ నటించింది. ఇందులో రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషించింది.