ఆడపిల్లలకి మార్షల్ ఆర్స్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి!
తాజాగా ఈ ఘటనని ఉద్దేశించి నటి రితికా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో ప్రతీ రెండు గటలకు కొకసారి మహిళలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించింది.
By: Tupaki Desk | 29 Sep 2023 3:00 AM GMTఇటీవల మధ్య ప్రదేశ్ లో ఉజ్జయినిలోని 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలన మైందో తెలిసిందే. అత్యాచారానికై గురై..నడి వీధిలో అర్ధనగ్నంగా రక్తమోడుతూ ఓ బాలిక సాయం కోరిన దృశ్యాలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఇలాంటి ఘటనలు దేశంలో ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. వెలుగులోకి వచ్చేది కొన్ని మాత్రమే. ఆడపిల్లలపై..పసికందులపై దాష్టికాలు నిత్యం వార్తల్లో ఓ సాధారణ వార్తగా మారిపోతుంది.
తాజాగా ఈ ఘటనని ఉద్దేశించి నటి రితికా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో ప్రతీ రెండు గటలకు కొకసారి మహిళలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించింది. 'వార్తల్లో ఇలాంటి సంఘటనలు చూసిన ప్రతీసారి నా రక్తం మరిగిపోతుంది. ఈ దారుణాలు ఇంకెప్పుడు ఆగుతాయో! మహిళలు అన్ని చోట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆడపిల్లలంతా సెల్ప్ డిఫెన్స్ నేర్చుకోవాలి. మార్షల్ ఆర్స్ట్ ట్రైనింగ్ అలవాటు చేసుకోవాలి.
దేశంలో పరిస్థితులు చూస్తుంటే మహిళలంతా మరింత రాటు దేలాలి అనిపిస్తుంది. ఇలాంటి దాడుల విషయంలో పిల్లలకు ముందుగానే అవగాహన కల్పించాలి. ఒంటరిగా ఉన్న సమయంలో తమని తాము ఎలా కాపాడుకోవాలో! చిన్న నాటి నుంచే అలవాటు చేయాలి. చిన్న పిల్లలతో ఇలాంటివి చెప్పడం ఇబ్బందిగా అనిపించినా తప్పదు. వారి భవిష్యత్ కోసంకొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప సమాజంలో ముందుకెళ్లలేం' అని సోషల్ మీడియాలో ఆవేదన చెందింది.
రితికా సింగ్ టాలీవుడ్ కి సుపరిచితమే. 'గురు'..'నీవెవరో' లాంటి చిత్రాల్లో నటించింది. ఇటీవలే రిలీజ్ అయిన 'కింగ్ ఆఫ్ కొత్త' సినిమాలోనూ నటించింది. రితికా సింగ్ మిక్స్ డు మార్సల్ ఆర్స్ట్ లో శిక్షణ తీసుకుంది. చిన్న వయసు నుంచే మార్షల్ ఆర్స్ట్ లో తర్పీదు పొందింది. ఈనేపథ్యంలో 'గురు' సినిమాలో బాక్సర్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది.