తెలుగులో చేయట్లేదేం?.. హీరోయిన్ భలే సమాధానం
వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రితికా సింగ్
By: Tupaki Desk | 4 March 2024 7:59 AM GMTవెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రితికా సింగ్. ఆమె రియల్ బాక్సర్ అవ్వడం తో గురూ సినిమాలోని తన పాత్రకు ప్రాణం పోసినట్టుగా నటించింది. ఆ తర్వాత తెలుగు లో అడపా దడపా సినిమాల్లో నటించింది.
టాలీవుడ్ లో గురూ తర్వాత వచ్చిన ఆఫర్లు ఏవీ కూడా ఆమెకు హిట్ ను తెచ్చి పెట్టలేదు. దాంతో ఇతర భాషల సినిమాలతో రితికా సింగ్ బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో వరుసగా రెండు మూడు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తెలుగు లో ఎందుకు నటించడం లేదు అనే ప్రశ్నకు భలే సమాధానం ఇచ్చింది.
రితికా తాజా చిత్రం 'వళరి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో రితికా మాట్లాడుతూ ఉండగా టాలీవుడ్ లో ఇతర భాషకు చెందిన హీరోయిన్స్ కు ప్రాముఖ్యత ఉంటుంది. కానీ మీకు ఎందుకు అక్కడ ఆఫర్లు రావడం లేదు అన్నట్లుగా ప్రశ్నించడం జరిగింది.
అందుకు రితికా స్పందిస్తూ... నేను సినిమాలు ఒప్పుకునేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. కథ మరియు పాత్ర మనస్ఫూర్తిగా నచ్చితేనే నేను సినిమాకు కమిట్ అవుతాను. ప్రస్తుతం నాకు ఇక్కడ మంచి ఆఫర్లు వస్తున్నాయి కనుక టాలీవుడ్ గురించి ఆలోచన లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ నుంచి ఆఫర్లు రాకున్నా కూడా రితికా మాత్రం తనకు మంచి కథ రాకపోవడం వల్ల సినిమాలు చేయడం లేదు అంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఇలాంటి సమాధానం కాకుండా ఆఫర్లు రావడం లేదు అని ఎవరైనా చెప్తారా చెప్పండి అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.