తెలుగు హీరోయిన్ కి జపానోళ్ల పుడ్ ఇష్టం!
తెలుగు హీరోయిన్ రీతూవర్మ సుపరిచితమే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి `ప్రేమ ఇష్క్ కాదల్` తో హీరోయిన్ గా ప్రమోట్ అయింది.
By: Tupaki Desk | 26 Feb 2025 9:30 AM GMTతెలుగు హీరోయిన్ రీతూవర్మ సుపరిచితమే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి `ప్రేమ ఇష్క్ కాదల్` తో హీరోయిన్ గా ప్రమోట్ అయింది. తెలుగులో ఇప్పటికే చాలా సినిమలు చేసింది. కోలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు పర్పెక్ట్ జోడీగా సెట్ అవుతుంది. `మజాకా` సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో అమ్మడు సందీప్ కిషన్ కి జోడీగా నటించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాగా ఇష్టపడి తినే పుడ్ ఏది? అంటే జనీస్ పుడ్ అంటూ షాకిచ్చింది. జపనీస్ పుడ్ ఎలా అలవాటుగా మారింది? అన్నది చెప్పలేదు గానీ అమితంగా ఇష్టపడి తినే పుడ్ అదేనంటూ చెప్పుకొచ్చింది. ఆతర్వాతే పప్పు, అప్పడం, రైస్ కు రెండవ ప్రాధాన్యత ఇచ్చింది. సాధారణంగా తెలుగు ప్రజలకు రైస్ అలవాటు. ఏ హీరోయిన్ అయినా పప్పు...అన్నం గురించి మాట్లాడుతారు. తప్పితే బిర్యానీ అంటారు.
తొలి ప్రాధాన్యత రైస్ కిచ్చి రెండవ ప్రాధాన్యత ఇతర రకాల పుడ్స్ కి ఇస్తుంటారు. కానీ రీతూవర్మ డిఫ రెంట్. ఒక్కసారి రీతూవర్మ పాస్ట్ లోకి వెళ్తే `పెళ్లి చూపులు` సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారింది. అటుపై `ఎవడే సుబ్రహ్మణ్యం`, `కేశవ`, `టక్ జగదీశ్`, `వరుడు కావలెను`, `ఒకే ఒక జీవితం’ లాంటి హిట్ చిత్రాలను ఖాతాలో వేసుకుంది.
గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తోనూ అభిమానులను ఆకట్టుకుని పాపులర్ అయింది. ఈ అమ్మడు పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. మిస్ హైదరాబాద్ రన్నరప్‌గా నిలిచింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి. ఈ నేపథ్యంలోనే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.