Begin typing your search above and press return to search.

తెలుగమ్మాయి 'స్వాగ్' ఆశలు

శ్రీవిష్ణు హీరోగా హసత్ గోలీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘స్వాగ్’.

By:  Tupaki Desk   |   23 Sep 2024 12:30 PM GMT
తెలుగమ్మాయి స్వాగ్ ఆశలు
X

శ్రీవిష్ణు హీరోగా హసత్ గోలీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘స్వాగ్’. ఈ మూవీ అక్టోబర్ 4న థియేటర్స్ లోకి రాబోతోంది. మూవీలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

సినిమాలో రీతూ వర్మ మంచి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతోందని టీజర్ బట్టి స్పష్టం అయ్యింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ కథాంశం ఉంటుందని టీజర్ చూస్తుంటే అర్ధమవుతోంది. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని హసత్ గోలీ రెడీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రీతూ వర్మ గత ఏడాది ‘మార్క్ ఆంటోనీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

స్ట్రైట్ తెలుగు అంటే 2022లో శర్వానంద్ కి జోడీగా ‘ఒకే ఒక జీవితం’లో రీతూ వర్మ కనిపించింది. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ‘స్వాగ్’ సినిమాలో ఆమె తన పూర్తిస్థాయి పెర్ఫార్మెన్స్ ని చూపించబోతుందంట. ‘స్వాగ్’ తన కెరియర్ లోనే బెస్ట్ మూవీ అని రీతూ వర్మ కూడా ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. సినిమాలో ఆమె రెండు టైం లైన్స్ లో భిన్నమైన క్యారెక్టర్స్ లలో కనిపిస్తోంది.

ఏదేమైనా ‘స్వాగ్’ సినిమాపైన రీతూ వర్మ చాలా హోప్స్ పెట్టుకుందని అర్ధమవుతోంది. ‘బాద్ షా’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రీతూ వర్మ ‘నా రాకుమారుడు’ సినిమాలో సోలో హీరోయిన్ గా చేసింది. అయితే విజయ్ దేవరకొండతో చేసిన ‘పెళ్లి చూపులు’ ఆమెకి హీరోయిన్ గా బ్రేక్ ఇచ్చింది. అక్కడి నుంచి హీరోయిన్ గానే ఆమె మూవీస్ చేస్తూ వస్తోంది.

అయితే వరుస సినిమాలతో సక్సెస్ లు అందుకుంటున్న కూడా రీతూ వర్మకి కమర్షియల్ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. చిన్న, మీడియం రేంజ్ హీరోలతోనే ఆమె సినిమాలు చేస్తోంది. అలాగే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. నటిగా అయితే రీతూ వర్మ తనని తాను ప్రూవ్ చేసుకుంది. కమర్షియల్ హీరోయిన్ గా ఎదగాలని అనుకుంటున్న ఈ బ్యూటీ మంచి బ్రేక్ కోసం అయితే వెయిట్ చేస్తోంది. ‘స్వాగ్’ సినిమాతో కోరుకున్న బ్రేక్ వస్తుందని అనుకుంటుంది. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది తెలియదు. తమిళంలో విక్రమ్ కి జోడీగా ‘ధృవనక్షత్రం’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఇప్పటికి రిలీజ్ కాలేదు. మరి రాబోయే రోజుల్లో అమ్మడు ఇంకా ఎలాంతో సినిమాలతో మెప్పిస్తుందో చూడాలి.