ఆ హీరోతో లిప్ కిస్సులో రీతూ వర్మ!
తెలుగు అమ్మాయి రీతు వర్మ గురించి పరిచయం అవసరం లేదు. అమ్మడు ఇప్పటికే తెలుగు, తమిళ్ లో చాలా సినిమాలు చేసింది.
By: Tupaki Desk | 18 Feb 2025 6:09 AM GMTతెలుగు అమ్మాయి రీతు వర్మ గురించి పరిచయం అవసరం లేదు. అమ్మడు ఇప్పటికే తెలుగు, తమిళ్ లో చాలా సినిమాలు చేసింది. `ప్రేమ ఇష్క్ కాదల్` తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు చాలా తెలుగు సినిమాలు చేసింది. అటుపై కోలీవుడ్ లోనూ చాలా సినిమాల్లో నటించింది. అయితే వెండి తెరపై ఎప్పుడూ హద్దులు మీరింది లేదు. గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంది. లిప్ కిస్సులు..ఇంటిమేట్ సీన్లు అంటే ఏ సినిమా విషయంలోనూ ఛాన్స్ తీసుకోలేదు.
అలాంటి ఆఫర్లు చాలా వచ్చినా? వద్దనుకుని తన ఫరిది మేర సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఏనాడు గ్లామర్ గేట్లు ఎత్తింది లేదు. అయితే తాజాగా రీతూ వర్మ కూడా సరిహద్దులు దాటేసిందని ఓ వార్త వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో `మజాకా`లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో హీరోగా సందీప్ కిషన్ నటిస్తున్నాడు. త్రినాధరావు సినిమాలంటే పక్కా కమర్శియల్ చిత్రాలు.
అవసరం మేర మసాలా సన్నివేశాలకు ఛాన్స్ తీసుకుంటాడు. ఈ నేపథ్యంలో మజాకాలో రీతూవర్మ హీరో సందీప్ కిషన్ తో ఓ లిప్ కిస్ సన్నివేశంలో నటించిందని ప్రచారం జరుగుతోంది. ఓ సీన్ డిమాండ్ మేరకు నక్కిన తప్పదు నటించాల్సిందేనని పట్టుబట్టడంతో రీతూ వర్మ ఛాన్స్ తీసుకుందని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి. రీతూ వర్మకు గ్లామర్ పాత్రల్లో నటించే అవకాశం వచ్చినా? నటించలేదు.
ఈ క్రమంలో చాలా అవకాశాలు కోల్పోయింది. అటు కోలీవుడ్ లో కూడా అవకాశాలు తగ్గడానికి ఇదే కారణమని చాలా కాలంగా అక్కడ మీడియాలో కథనాలొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం రీతూ వర్మ చేతిలో ఉన్నది కూడా `మజాకా` చిత్రమే. కోలీవుడ్ లో `ధృవ నక్షత్రం` సినిమా చేసింది గానీ ఆ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు. చాలా కాలాంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో `మాజాకా` చిత్రంతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలోనే లిప్ కిస్సు కి ఒకే చెప్పిందనే వార్తలొస్తున్నాయి.