అసలు నటి అవాలనుకోలేదు. కానీ..: రీతూ వర్మ
మజాకా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న రీతూ వర్మ రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
By: Tupaki Desk | 20 Feb 2025 6:30 PM GMTఅందం, అభినయంతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి రీతూ వర్మ. గతేడాది శ్వాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రీతూ వర్మ ఇప్పుడు మజాకా సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ నటించిన మజాకా సినిమా ఈ నెల 26న రిలీజ్ కానుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
మజాకా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న రీతూ వర్మ రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. మజాకా కథ ఎంతో ఎంటర్టైనింగ్ గా అనిపించిందని, స్టోరీ విన్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని చెప్పిన రీతూ, ఈ సినిమాలో తన పాత్రకు ఎంతో ప్రాధాన్యముందని చెప్పింది.
మజాకాలో బలమైన భావోద్వేగాలున్నాయని, సినిమాలో సందీప్, తన లవ్ స్టోరీతో పాటూ రావు రమేష్, అన్షు లవ్ ట్రాక్ కు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బాండింగ్ సినిమాకు కీలకంగా నిలవనుందని చెప్పింది. మజాకాలో లాంటి కొత్త తరహా పాత్ర తానెప్పుడూ చేయలేదని, అందరికీ ఆ పాత్ర చాలా నచ్చుతుందని తెలిపింది.
ఈ సినిమా సెకండాఫ్ లో తనకు రావు రమేష్ కు మధ్య ఉండే సింగిల్ టేక్ సీన్ గురించి మాట్లాడుతూ, ఆ సీన్ ను చాలా బాగా చేశానని రావు రమేష్ ఫోన్ చేసి మరీ అభినందించారని, ఆ విషయాన్ని తానెప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. తన కెరీర్ విషయంలో రీతూ చాలా హ్యాపీగా ఉన్నానని, అసలు తాను నటి అవాలనుకోలేదని, అయినప్పటికీ తానింత దూరం వచ్చి ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నానని, అది తనకెంతో సంతృప్తినిస్తోందని రీతూ చెప్తోంది.
నటిగా పలు మంచి సినిమాల్లో భాగమైనందుకు ఆనందపడుతున్న రీతూకి యాక్షన్ బేస్డ్ రోల్స్ చేయాలనున్నట్టు తెలిపింది. కామెడీ సినిమాలంటే కూడా ఇష్టమని అందుకే మజాకా సినిమా ఒప్పుకున్నట్టు చెప్పింది. ఎప్పటికైనా ఫుల్ లెంగ్త్ పీరియాడిక్ మూవీ చేయాలనుందని చెప్పిన రీతూ, ప్రస్తుతం తెలుగులో ఓ మల్టీస్టారర్ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడించింది. అది కాకుండా శ్రీకారం డైరెక్టర్ కిశోర్ దర్శకత్వంలో చేసిన ఓ వెబ్‌సిరీస్ త్వరలోనే రిలీజ్ కానున్నట్టు అమ్మడు తెలిపింది.