Begin typing your search above and press return to search.

హీరోయిన్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్..!

ఐతే సినిమాకు తాము పెట్టాల్సిన ఎఫర్ట్స్, పడాల్సిన కష్టం పడ్డాక ఒకవేళ అది వర్క్ అవుట్ కాకపోయినా సరే అందులో నటించిన హీరోలైనా, హీరోయిన్స్ అయినా పెద్దగా ఫీల్ అవ్వరు.

By:  Tupaki Desk   |   3 Oct 2024 1:30 AM GMT
హీరోయిన్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్..!
X

కెరీర్ లో సక్సెస్ లేకపోతే కొంతమందికి అవకాశం వచ్చినా ఏదో వచ్చిందిలే చేసేద్దాం లే అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా అసలేమాత్రం ఫాం లో లేని భామలు కొన్ని ఛాన్స్ లు వచ్చినా అంతగా ఆసక్తి పెట్టలేరు. కానీ తెలుగు అమ్మాయి రీతు వర్మ వాళ్లకి భిన్నంగా ఛాన్స్ వచ్చింది అంటే చాలు దాని కోసం ప్రాణం పెట్టేస్తుంది. హిట్లు ఫ్లాపులు అనేవి కొన్నిసార్లు లక్ ని బట్టి తగులుతాయి. ఐతే సినిమాకు తాము పెట్టాల్సిన ఎఫర్ట్స్, పడాల్సిన కష్టం పడ్డాక ఒకవేళ అది వర్క్ అవుట్ కాకపోయినా సరే అందులో నటించిన హీరోలైనా, హీరోయిన్స్ అయినా పెద్దగా ఫీల్ అవ్వరు.

అలాంటి కేటగిరిలోకే వస్తుంది రీతు వర్మ. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో సక్సెస్ ల కన్నా ఫ్లాపులే ఎక్కువ అయినా కూడా అమ్మడు ఎక్కడ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వట్లేదు. అందుకే వచ్చిన పాత్రకు తన డెడికేషన్ చూపించి పాత్రకు కొత్త వన్నె తెస్తుంది. ప్రస్తుతం రీతు వర్మ శ్రీ విష్ణుతో శ్వాగ్ సినిమాలో నటించింది. సినిమాలో ఆమెది చాలా ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది.

మూడు తరాల కథలతో వస్తున్న శ్వాగ్ సినిమాలో రీతు వర్మ కూడా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించింది. ఐతే ముఖ్యంగా ఒక పాత్ర కోసం అమ్మడు చాలా వెయిట్ లాస్ అయినట్టు తెలుస్తుంది. శ్వాగ్ సినిమాలో రుక్మిణి దేవి పాత్ర కోసం రీతు వర్మ చాలా బరువు తగ్గారట. సినిమా కోసమే తను చేస్తున్న పాత్ర కోసమే రుక్మిణి వెయిట్ లాస్ అయినట్టు తెలుస్తుంది. సినిమా కోసం ఆమె చూపించే డెడికేషన్ చూసిన కొందరు ఇలాంటి వారికి తప్పకుండా సక్సెస్ రావాలని అంటున్నారు.

వరుస సక్సెస్ లతో ఫాం లో ఉన్న శ్రీ విష్ణు శ్వాగ్ తో హ్యాట్రిక్ కొడతాడా.. కెరీర్ లో అసలు దూకుడు లేని రీతు వర్మ కెరీర్ లో జోష్ వచ్చేలా చేస్తాడా అన్నది చూడాలి. శ్వాగ్ సినిమాతో రీతు వర్మ తిరిగి ఫాం లోకి రావాలని ఆమె ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు. అక్టోబర్ 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. హసిత్ గోలి డైరెక్ట్ చేసిన శ్వాగ్ సినిమా రిజల్ట్ మీద చిత్ర యూనిట్ అంతా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన విషయం తెలిసిందే.