Begin typing your search above and press return to search.

యూట్యూబ్‌లో హీరోయిన్ సెర్చ్.. షిట్! అనేసిన క్రికెట‌ర్

క్రికెట్ క్రీడాకారుడిగా ఎదిగేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు సాగిస్తూనే ఉన్నాడు.

By:  Tupaki Desk   |   11 Feb 2025 11:30 PM GMT
యూట్యూబ్‌లో హీరోయిన్ సెర్చ్.. షిట్! అనేసిన క్రికెట‌ర్
X

ఐపిఎల్ 2024 ముగించిన త‌ర్వాత‌ భారత యువ‌ క్రికెటర్ రియాన్ పరాగ్ యూట్యూబ్ శోధ‌న గురించి బ‌హిర్గ‌తం చేస్తూ ప‌రువు తీసింది మీడియా. అతడు త‌న యూట్యూబ్ సెర్చ్ లో హీరోయిన్ అన‌న్య పాండే, సారా అలీఖాన్ వంటి యువ‌న‌టీమ‌ణుల‌ గురించి సెర్చ్ చేసాడ‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. అప్ప‌ట్లో దీనిపై రియాన్ స్పందించ‌లేదు. అతడు తన క్రికెట్ కెరీర్‌పై దృష్టి సారించాడు. జూలై 2024లో తన తండ్రి బహుమతిగా ఇచ్చిన అస్సాం నుండి ఇండియా క్యాప్ అందుకున్న మొదటి క్రికెటర్ అయ్యాడు. క్రికెట్ క్రీడాకారుడిగా ఎదిగేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు సాగిస్తూనే ఉన్నాడు.

తాజాగా రియాన్ పాత వివాదంపై సిటీ రేడియో స్టేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన యూట్యూబ్ శోధన చరిత్ర అనుకోకుండా ప్రత్యక్ష ప్రసారం అయింద‌ని గ్రహించిన విష‌యాన్ని పరాగ్ గుర్తుచేసుకున్నాడు. ఐపీఎల్ లో ఆడి అల‌సిపోయాక రీఫ్రెష్ అయ్యేందుకు మ్యూజిక్ వినాల‌నుకున్నాను. కానీ నా సిస్ట‌మ్ లో స్పోటిఫై కానీ, యాపిల్ కానీ అందుబాటులో లేవు. ఆ త‌ర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసాను. కానీ సెర్చ్ లో ఉన్న హ్యాష్ ట్యాగుల‌న్నీ మీకు క‌నిపించాయి. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌లు వైర‌ల్ అయ్యాయి. ఆ త‌ర్వాత నాకు ఈ విష‌యం తెలిసింది.. అని రియాన్ అన్నారు.

రియాన్ స్పంద‌న‌ సోషల్ మీడియాలో వేగంగా వైర‌ల్ అయింది. ఐపీఎల్ ముగిశాక చెన్నైలో ఉన్నాము. మ్యాచ్ ముగించాను.. ఐపీఎల్ కోసం చాలా శ్ర‌మించాన‌ని కూడా అత‌డు అన్నాడు. యాప్‌లు తొల‌గించ‌డంతో యూట్యూబ్ లో మ్యూజిక్ కోసం వెతికాన‌ని కూడా షిరాగ్ అన్నారు.