Begin typing your search above and press return to search.

గ‌దిలో ఉరేసుకున్న RJ కం ఇన్‌ఫ్లూయెన్సర్?

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ఆర్.జే సిమ్ర‌న్ (26) గుర్గావ్ ఫ్లాట్‌లో శవమై కనిపించింది. ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు అనుమానిస్తున్నారు

By:  Tupaki Desk   |   28 Dec 2024 3:35 AM GMT
గ‌దిలో ఉరేసుకున్న RJ కం ఇన్‌ఫ్లూయెన్సర్?
X

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ఆర్.జే సిమ్ర‌న్ (26) గుర్గావ్ ఫ్లాట్‌లో శవమై కనిపించింది. ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు అనుమానిస్తున్నారు. చాలా కాలంగా సిమ్ర‌న్ డిప్రెషన్‌తో బాధ‌ప‌డుతోంద‌ని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. సిమ్రాన్ మరణం ప‌లువురు ప్ర‌ముఖుల‌ను క‌దిలించింది. ఈ అంద‌మైన అమ్మాయి త‌న యూట్యూబ్ ద్వారా జమ్మూ & కాశ్మీర్ సంస్కృతికి చేసిన కృషిని ప్ర‌శంసిస్తూ ప‌లువురు నాయ‌కులు సంతాపం తెలియ‌జేసారు. ప్ర‌స్తుతం సిమ్ర‌న్ మ‌ర‌ణంపై విచార‌ణ సాగుతోంది. శవపరీక్ష నివేదిక వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.

సిమ్రాన్ సింగ్ గుర్గావ్‌లోని తన గది సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించార‌ని పోలీసులు చెబుతున్నారు. మాజీ రేడియో జాకీ సిమ్ర‌న్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా రాణిస్తోంది. సిమ్రాన్ సింగ్ సెక్టార్ 46లోని అద్దె ఫ్లాట్‌లో నివ‌శిస్తోంది. గ‌దిలో త‌న‌ను ఆచేత‌నంగా చూసిన‌ ఫ్లాట్‌మేట్‌లు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు.

చ‌ట్ట‌ప్ర‌కారం శ‌వ‌ప‌రీక్ష నిర్వ‌హించి సిమ్ర‌న్ పార్థీవ దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేశామ‌ని పోలీసులు చెప్పారు. ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు సాగుతోంది. సిమ్ర‌న్ గ‌దిలో ఎలాంటి సూసైడ్ నోట్ ల‌భించ‌లేదు. ప్ర‌స్తుతం డిప్రెష‌న్ కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని భావిస్తున్నారు. కుటుంబ స‌భ్యులు ఇంకా ఫిర్యాదు నమోదు చేయలేద‌ని పోలీసులు తెలిపారు. జమ్మూలో రేడియో జాకీగా పనిచేసిన తర్వాత 2021లో గుర్గావ్‌కు మకాం మార్చిన సిమ్రాన్, విజయవంతమైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా స్థిరపడింది. సిమ్రాన్ మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు పంపించే ముందు పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 194 ప్రకారం అన్ని చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేశారు.