Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో-45 అత‌డికి ఇదే తొలి సినిమా!

కోలీవుడ్ స్టార్ సూర్య 45వ చిత్రం ఆర్.జె బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Oct 2024 5:24 AM GMT
ఆ స్టార్ హీరో-45 అత‌డికి ఇదే తొలి సినిమా!
X

కోలీవుడ్ స్టార్ సూర్య 45వ చిత్రం ఆర్.జె బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ ఎంట‌ర్ టన‌ర్ గా ఈ చిత్రాన్ని మ‌లుస్తున్న‌ట్లు తెలుస్తోంది. యాక్ష‌న్ సినిమాలంటే సూర్య చెల‌రేగిపోతాడ‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. యాక్ష‌న్ పాత్ర‌ల‌కు పెట్టింది పేరుగా తానో బ్రాండ్. అందులోనూ కాప్ స్టోరీల్లో సూర్య పెర్పార్మెన్స్ పీక్స్ లో ఉంటుంద‌ని సింగం ప్రాంచైజీ ప్రూవ్ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ సింగం నుంచి రిలీజ్ అయిన మూడు భాగాల్లోరెండు భాగాలు మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

దీంతో `సింగం-4 `కోసం అభిమానులు అంతే ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఎదురు చూపులు ఇంకొంత కాలం త‌ప్ప‌దు. కానీ మ‌ధ్య‌లో 45వ సినిమాతో యాక్ష‌న్ స్టార్ గా మెప్పించనున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ కోలీవుడ్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇది కూడా కాప్ స్టోరీ అని..ఇందులో సూర్య ప‌వ‌ర్ పుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లోనే న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఈ పాత్ర చాలా ప‌వ‌ర్ పుల్ గా ఉంటుంద‌ని, `సింగం` ప్రాంచైజీని మించి బాలాజీ ఆ పాత్ర‌ని మ‌రింత శ‌క్తివంతంగా డిజైన్ చేసిన‌ట్లు వార్త లొస్తున్నాయి. అయితే ఇక్క‌డ ట్విస్ట్ ఏంటి? అంటే ఇంత‌వ‌ర‌కూ ఆర్జే బాలాజీ సినిమాలు డైరెక్ట్ చేయ‌క‌పోవ‌డం. ఆయ‌న న‌టుడిగా చాలా సినిమాలు చేసాడు. కొన్ని సినిమాల‌కు కోడైరెక్ట‌ర్ గా ప‌నిచేసాడు.

ఇప్పుడు సూర్య సినిమాతోనే డైరెక్ట‌ర్ గా ప‌రిచయం అవుతున్నాడు. ప‌వ‌ర్ పుల్ యాక్ష‌న్ కంటెంట్ వినూత్నంగా ఉండ‌టంతో పాటు, సూర్య పాత్ర‌ని తీర్చి దిద్దిన తీరు న‌చ్చ‌డంతో బాలాజీ కొత్త వాడైనా సూర్య కాన్పిడెంట్ గా ముందుకెళ్తున్నాడు. బాలాజీ త‌మిళ అనువాద చిత్రాల‌తో తెలుగు వాళ్ల‌కు బాగా సుప‌రిచితుడే. మ‌హ‌ష్ న‌టించిన `స్పైడ‌ర్` సినిమాలో హీరో స్నేహితుడి పాత్ర‌లో న‌టించాడు.