స్టార్ హీరోయిన్ రెస్టారెంట్లో భారీ దొంగతనం!
దొంగతనానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.... ముంబైలోని పలు ఏరియాల్లో శిల్పా శెట్టికి చెందిన బాస్టియన్ రెస్టారెంట్ లు ఉన్నాయి.
By: Tupaki Desk | 29 Oct 2024 7:15 AM GMTబాలీవుడ్ నటి శిల్పా శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలు చేయకున్నా ఏదో ఒక విషయం కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఆమె భర్త వల్ల కొన్నాళ్లు పదే పదే వార్తల్లో నిలిచిన శిల్పా శెట్టి ఇప్పుడు ఆమె నిర్వహించే రెస్టారెంట్ లో జరిగిన ఒక సంఘటన కారణంగా వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆమె నిర్వహిస్తున్న రెస్టారెంట్లో దొంగతనం జరగడంతో చాలా మంది ఆమెను బాధ్యులు అని విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటివరకు శిల్పా శెట్టి మీడియా ముందుకు వచ్చి కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ స్పందించలేదు. దాంతో మరింతగా ఆమెను కొందరు టార్గెట్ చేస్తున్నారు.
దొంగతనానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.... ముంబైలోని పలు ఏరియాల్లో శిల్పా శెట్టికి చెందిన బాస్టియన్ రెస్టారెంట్ లు ఉన్నాయి. వాటి నిర్వహణ బాధ్యత పూర్తిగా శిల్పా ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటారని సమాచారం. ఆమె కు చెందిన దాదర్‌లోని కోహినూర్ స్క్వేర్ బాస్టియన్ రెస్టారెంట్ బేస్మెంట్ పార్కింగ్ లో ఉన్న కారును ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు.
బాంద్రాకు చెందిన రుహాన్ ఖాన్ అనే వ్యాపారవేత్త స్నేహితులతో కలిసి బాస్టియన్ రెస్టారెంట్ కు వెళ్లాడు. ఆ సమయంలో వ్యాలెట్ పార్కింగ్ చేయడం జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది రుహాన్ ఖాన్ యొక్క ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బేస్మెంట్ లో పార్క్ చేయడం జరిగింది.
అర్థరాత్రి సమయంలో స్నేహితులతో కలిసి రుహాన్ ఖాన్ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి కారును తీసుకు రావాల్సిందిగా సెక్యూరిటీ వారికి సూచించడం జరిగింది. అప్పుడు రుహాన్ వద్దకు సెక్యూరిటీ వారు వచ్చి మీ కారు బేస్మెంట్ లో లేదని, ఎవరో దొంగిలించారని చెప్పారట. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన రుహాన్ ఖాన్ సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేయగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కారును దొంగిలించి తీసుకు వెళ్లారు.సెక్యూరిటీ సిబ్బంది అజాగ్రత్త వల్లే ఈ దొంగతనం జరిగిందని క్లియర్ గా అర్థం అవుతుందని రుహాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు.
తన బీఎండబ్ల్యూ కారును బాస్టియన్ రెస్టారెంట్ బేస్మెంట్ లో పార్క్ చేసిన సమయంలో దొంగతనం జరిగిందని రుహాన్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇప్పటి వరకు శిల్పా శెట్టి లేదా ఆమె భర్త ఇతర రెస్టారెంట్ సహ భాగస్వామ్యులు ఎవరూ ఈ దొంగతనం గురించి నోరు విప్పడం లేదు. ఇలాంటివి ముందు ముందు జరగకుండా చూసుకోవాలని, లేదంటే రెస్టారెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుందని పలువురు ఈ సందర్భంగా శిల్పా శెట్టికి సూచిస్తున్నారు. ఆమె నుంచి మాత్రం నో రెస్పాన్స్.