Begin typing your search above and press return to search.

మార్వెల్ అవెంజ‌ర్స్‌లో రాబ‌ర్ట్ డౌనీ అధికారిక ఎంట్రీ

హాలీవుడ్ సుప్ర‌సిద్ధ స్టార్ గా రాబర్ట్ డౌనీ జూనియర్ సుప‌రిచితుడు.

By:  Tupaki Desk   |   28 July 2024 10:15 AM
మార్వెల్ అవెంజ‌ర్స్‌లో రాబ‌ర్ట్ డౌనీ అధికారిక ఎంట్రీ
X

హాలీవుడ్ సుప్ర‌సిద్ధ స్టార్ గా రాబర్ట్ డౌనీ జూనియర్ సుప‌రిచితుడు. అత‌డు సూపర్ హీరో క్యారెక్టర్ ఐరన్ మ్యాన్ పాత్రతో అభిమానుల‌ను అల‌రించాడు. అధికారికంగా ఎవెంజర్స్: డూమ్స్‌డే- ఎవెంజర్స్: సీక్రెట్ వార్స్ పేరుతో రానున్న ఎవెంజర్స్ మూవీస్‌లో మార్వెల్ సినిమాలకు అత‌డు తిరిగి వస్తున్నాడు.

కానీ ఈసారి ఒక ట్విస్ట్ ఉంది. అతను సూపర్ హీరో ఐరన్ మ్యాన్‌గా తిరిగి రావడం లేదు. బదులుగా ప్రత్యామ్నాయ మల్టీవర్స్ టైమ్‌లైన్‌లో అతడు సూపర్‌విలన్ డాక్టర్ డూమ్‌గా కనిపిస్తాడు. మార్వెల్ కొన్ని గంటల క్రితం శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC 2024) వద్ద హాల్ H వద్ద వారి మార్క్యూ ప్యానెల్ సందర్భంగా ఈ అద్భుతమైన ప్రకటన చేసింది.

రాబర్ట్ డౌనీ జూనియర్ వేదికపైకి వచ్చి తన ముసుగును తొల‌గించ‌గానే అభిమానులు థ్రిల్ కి గుర‌య్యారు. అతడు డా. డూమ్ పాత్రను పోషిస్తున్నట్లు ప్రకటించడానికి తన ఐకానిక్ భంగిమను ప్రదర్శించగా అభిమానులు కేరింత‌లు కొట్టి స్వాగ‌తించారు. ఊహించని ఈ వార్త ఆస్కార్ విజేత రాబ‌ర్ట్ డౌనీ అభిమానులను ఆనందపరిచింది. కొత్త అవెంజర్స్ సినిమాలు వరుసగా మే 2026, మే 2027లో అధికారికంగా విడుదల కానున్నాయి. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ల ద‌శ‌లో ఉన్నాయి.