Begin typing your search above and press return to search.

సమరానికి సిద్ధమైన రాబిన్ హుడ్: రిలీజ్ డేట్ ఫిక్స్!

ఇక సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   18 Jan 2025 7:35 AM GMT
సమరానికి సిద్ధమైన రాబిన్ హుడ్: రిలీజ్ డేట్ ఫిక్స్!
X

యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా వస్తున్న రాబిన్ హుడ్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. చిత్రంలోని సాంగ్స్, టీజర్ ఇప్పటికే విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు. పలు కారణాల వల్ల 2024 డిసెంబర్ 20న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. దీంతో, సినిమా కొత్త విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


తాజాగా, మేకర్స్ ఒక పర్‌ఫెక్ట్ డేట్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ఇప్పుడు మార్చి 28న విడుదల కానుంది. వేసవి ప్రారంభానికి ముందే విడుదలవుతున్న ఈ చిత్రం, ఉగాది సెలవులను ఉపయోగించుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.

నితిన్ కెరీర్‌లో మరో ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. గతంలో బీష్మ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్‌ లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకుంది.

హీరో నితిన్ స్టైలిష్ లుక్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. శ్రీలీల గ్లామర్ షోతో పాటు, హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉండబోతోందని సమాచారం. ఇదిలా ఉంటే, రిలీజ్ డేట్ మార్చి 28 అనగానే, ఈ సినిమా వేసవి బరిలో అడుగుపెడుతుందనేది స్పష్టమవుతోంది. ఉగాది పండుగ సెలవులతో పాటు వారం రోజుల పాటు ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.

మొత్తం మీద, రాబిన్ హుడ్ సినిమా నితిన్ కెరీర్‌లో మరో భారీ హిట్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 28న థియేటర్లలో సందడి చేయబోతున్న ఈ చిత్రానికి అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, దయనంద్ లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.