రాబిన్ హుడ్ తో వార్నర్ భాయ్ సర్ ప్రైజ్.. గెట్ రెడి!
హైదరాబాద్‌కు అడుగుపెట్టిన వార్నర్ ను డైరెక్టర్ వెంకీ కుడుముల ఘనంగా స్వాగతం పలికారు. ఫ్లవర్స్ బొకే ఇచ్చి వార్నర్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు.
By: Tupaki Desk | 23 March 2025 4:59 AMఈ ఏడాది సమ్మర్ సీజన్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న సినిమాల్లో ‘రాబిన్ హుడ్’ హైలెట్ అయ్యేలా కనిపోస్తోంది. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇప్పటికే ప్రామోషనల్ కంటెంట్‌తో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కంపోజ్ చేసిన పాటలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఇక ట్రైలర్ లాంచ్‌తో ఈ హైప్ మరో స్టేజ్‌కి వెళ్లనుంది.
మార్చి 23న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవోటెల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా, దీనిపై ఇండస్ట్రీలో ఆసక్తి మరింతగా పెరుగుతోంది. ఈ వేడుకను మరింత ప్రెస్టీజియస్ చేసేలా ప్లాన్ చేసిన టీం, గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌ను ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ ముందు సెట్ చేయడం కూడా స్ట్రాటజిక్ గా మారింది. టైమింగ్ పరంగా ఇది మ్యాజిక్ చేయనుందనే అంచనాలు ఉన్నాయి.
అభిమానులు మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా ‘రాబిన్ హుడ్’ బిజినెస్ రేంజ్‌పై ఆసక్తి పెరుగుతోంది. ఇక 5 గంటల నుంచి మొదలయ్యే ఈ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజ్ హైలైట్ కానుంది. అతని చేతుల మీదుగానే ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ వేడుకకు నిజంగా ప్రత్యేకతను తీసుకొస్తున్నది ఆస్ట్రేలియన్ క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న వార్నర్, తన మొదటి తెలుగు సినిమా అయిన రాబిన్ హుడ్‌తో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు.
హైదరాబాద్‌కు అడుగుపెట్టిన వార్నర్ ను డైరెక్టర్ వెంకీ కుడుముల ఘనంగా స్వాగతం పలికారు. ఫ్లవర్స్ బొకే ఇచ్చి వార్నర్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా వార్నర్ హాజరవుతుండటం సినిమాకు మరింత బజ్ తీసుకురానుంది. వార్నర్ ప్రెజెన్స్‌తో రాబిన్ హుడ్ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్న ప్రమోషన్ స్ట్రాటజీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. క్రికెట్ అభిమానులు, సినిమా లవర్స్ ఇద్దరినీ టార్గెట్ చేసే విధంగా వారు అడుగులు వేస్తున్నారు.
వార్నర్ ట్రైలర్‌ను లాంచ్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో ఈ సినిమా చర్చను మరింత పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఇది బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్‌కి బూస్ట్‌గా మారవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘రాబిన్ హుడ్’ ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ పరంగా మంచి ఫిగర్లను రాబడుతున్నట్టు టాక్. ఇక ఈ సినిమా విజయవంతం అయితే నితిన్ కెరీర్ కి మళ్లీ ఫుల్ స్పీడ్ వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డేవిడ్ వార్నర్ ఎంట్రీతో ఈ సినిమా యూత్, క్రికెట్ అభిమానుల్లో కూడా మరింత బజ్ కల్పించనుంది. మొత్తానికి.. రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ తోనే గట్టిగా సౌండ్ వినిపించేలా ఉంది.