Begin typing your search above and press return to search.

రాబిన్‌హుడ్ నుంచి టెప్టింగ్ స‌ర్‌ప్రైజ్

ఇప్ప‌టికే రాబిన్‌హుడ్ నుంచి రెండు పాట‌లు రిలీజ‌వ‌గా, ఆ రెండూ మంచి చార్ట్‌బ‌స్ట‌ర్లుగా నిలిచాయి.

By:  Tupaki Desk   |   6 March 2025 6:27 PM IST
రాబిన్‌హుడ్ నుంచి టెప్టింగ్ స‌ర్‌ప్రైజ్
X

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టించిన మోస్ట్ అవెయిటెడ్ మూవీ రాబిన్‌హుడ్. ఈ సినిమా మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ఎప్ప‌టిక‌ప్పుడు సినిమా గురించి అప్డేట్స్ ఇస్తూ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొద‌లుపెట్టింది. ఇప్ప‌టికే రాబిన్‌హుడ్ నుంచి రెండు పాట‌లు రిలీజ‌వ‌గా, ఆ రెండూ మంచి చార్ట్‌బ‌స్ట‌ర్లుగా నిలిచాయి.


అన్నింటికంటే ముందుగా రిలీజైన రాబిన్‌హుడ్ టీజ‌ర్ ఆడియ‌న్స్ లోకి వెళ్లి మంచి రెస్పాన్స్ అందుకుంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న ఈ సినిమా విష‌యంలో ఆడియ‌న్స్ కు రోజురోజుకీ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఆడియ‌న్స్ కు ఓ పెద్ద స‌ర్‌ప్రైజ్ ఇవ్వాల‌ని డిసైడై మార్చి 10న అది దా స‌ర్‌ప్రైజు అనే స్పెష‌ల్ సాంగ్ ను రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అనౌన్స్ చేశారు.

హాటెస్ట్ స‌ర్‌ప్రైజ్ ఆఫ్ ది ఇయ‌ర్ గా చెప్తూ మేక‌ర్స్ ఈ సాంగ్ ను స్పెష‌ల్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. ఈ స్పెష‌ల్ సాంగ్ లో యంగ్ బ్యూటీ కేతిక శ‌ర్మ మెర‌వ‌నుంది. టాలీవుడ్ లో కేతికకు, తన అందాల‌కు చాలా పెద్ద ఫాలోయింగే ఉంది. ఈ సాంగ్ లో కేతిక గ్లామ‌ర్ తో పాటూ త‌న డ్యాన్సులు థియేట‌ర్ల‌ను ఊపు ఊపుతాయ‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది.

జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందించిన ఈ పాట క‌చ్ఛితంగా పార్టీ సాంగ్ అవుతుంద‌ని మేక‌ర్స్ చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు. ఇక సినిమా విష‌యానికొస్తే రాబిన్‌హుడ్ లో నితిన్ కు జోడీగా శ్రీలీల న‌టిస్తోంది. మూవీలో వీరిద్ద‌రి కెమిస్ట్రీ చాలా బాగా వ‌ర్క‌వుట్ అయింద‌ని ఇప్ప‌టికే నిర్మాత ర‌వి శంక‌ర్ చెప్పిన విష‌యం తెలిసిందే.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాతో వెంకీ మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఆల్రెడీ నితిన్- వెంకీ కుడుముల కాంబోలో వ‌చ్చిన భీష్మ సూప‌ర్ హిట్ అవ‌డంతో రాబిన్‌హుడ్ పై కూడా అంద‌రికీ మంచి అంచ‌నాలున్నాయి.