వార్నర్ ఫన్నీ ట్విస్ట్.. రాబిన్ హుడ్ ప్రోమోషన్ రూటే వేరు!
జివి ప్రకాష్ అందించిన మ్యూజిక్ సాంగ్స్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి.
By: Tupaki Desk | 27 March 2025 9:43 AMనితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా, వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘రాబిన్ హుడ్’ మార్చి 28న థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులోని యాక్షన్, కామెడీ, ఎమోషనల్ మిక్స్ అంచనాలను పెంచుతున్నాయి. జివి ప్రకాష్ అందించిన మ్యూజిక్ సాంగ్స్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. స్క్రీన్‌ప్లే విభిన్నంగా ఉండనుందని ట్రేడ్ టాక్.
ఈసారి ప్రమోషన్ పరంగా సినిమా యూనిట్ కొత్త మార్గం ఎంచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నితిన్, ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ పంచేలా ప్రీ రిలీజ్ ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా యూత్, క్రికెట్ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యేలా మల్టీ యాంగిల్డ్ ప్రమోషన్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫన్ వీడియోలు, సోషల్ మీడియా రీల్స్, ఇంటర్వ్యూలు ఇలా వరుసగా వదులుతున్నారు.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో డేవిడ్ వార్నర్ “I AM IN SRH” అని ప్లకార్డ్ పట్టుకున్నట్టు చూపించారు. వెంటనే నితిన్, శ్రీలీల కలిసి “SRH కాదు RH అంటే రాబిన్ హుడ్” అని సూటిగా చెప్పడం ప్రేక్షకులను నవ్వించింది. ఈ ప్రోమో ఫన్ ఎలిమెంట్‌తో పాటు సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంది. స్పోర్ట్స్, సినిమా మధ్య ఉన్న మిక్స్‌ని సరిగ్గా క్యాష్ చేసుకునే విధంగా ఈ ప్రోమో రూపొందించారు.
రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ గెస్ట్ అప్పీరెన్స్ ఉండనుందని మేకర్స్ ముందుగానే వెల్లడించగా, ట్రైలర్ లో ఒక్క షాట్ తోనే హాట్ టాపిక్ అయ్యేలా చేశారు. దీన్ని మరింత ఆకట్టుకునేలా స్క్రిప్ట్‌లో డిజైన్ చేశారట. అయితే సినిమా ప్రమోషన్‌లో వార్నర్ సర్‌ప్రైజ్ పాత్రను అంతకంతకూ బిగ్ సాంగ్‌లా ట్రీట్ చేస్తున్నారు. ఫ్యాన్స్‌కి ఇది స్పెషల్ హైలైట్ అవుతుందన్న నమ్మకం యూనిట్‌ది.
ఈ చిత్రానికి ఉన్న మార్కెట్ బజ్ కూడా గట్టిగానే ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని U/A సర్టిఫికేట్ పొందింది. 2 గంటల 36 నిమిషాల రన్ టైమ్‌కి కథ, స్క్రీన్‌ప్లే ఫ్లో అనుగుణంగా పేసింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, యాక్షన్; సెకండ్ హాఫ్‌లో ట్విస్ట్‌లు, ఎమోషనల్ డ్రైవ్‌ని ఫొకస్ చేసినట్టు సెన్సార్ టాక్. మొత్తంగా చూస్తే, ‘రాబిన్ హుడ్’ బజ్ మీద బజ్ క్రియేట్ చేసుకుంటూ హిట్ ట్రాక్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్ పరంగా కొత్త మార్గాల్లో ప్రయోగాలు చేస్తూ నితిన్ టీం ప్రేక్షకులకు చేరువవుతుంది. మరి థియేటర్ లో ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.