రాబిన్‌హుడ్ కు పర్మిషన్ కొన్ని ఏరియాల్లో మాత్రమే!
మార్చి 28న రిలీజ్ కానున్న ఈ సినిమా భారీ ఎత్తున ప్రమోషన్స్ ను నిర్వహిస్తూ ఆడియన్స్ కు బాగా రీచ్ అయింది.
By: Tupaki Desk | 25 March 2025 5:32 PM ISTనితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ రాబిన్‌హుడ్. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ తో నిర్మించారు. మార్చి 28న రిలీజ్ కానున్న ఈ సినిమా భారీ ఎత్తున ప్రమోషన్స్ ను నిర్వహిస్తూ ఆడియన్స్ కు బాగా రీచ్ అయింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. రాబిన్‌హుడ్ సినిమాకు టికెట్ రేట్లు పెంచడంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో భారీ ఎత్తు విమర్శలు తలెత్తాయి. దీంతో ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.
రాబిన్‌హుడ్ సినిమాకు టికెట్ రేట్లు పెంచారని ఫేక్ వార్తలు వస్తున్నాయని, అవన్నీ నిజం కాదని, ప్రేక్షకులకి అందుబాటు ధరల్లో వినోదాన్ని అందించడమే తమ సినిమా మెయిన్ టార్గెట్ అని, అన్ని ఏరియాల్లో టికెట్ రేట్లు పెంచలేదని, కేవలం కొన్ని సెలెక్టెడ్ ఏరియాల్లో మాత్రమే ఏపీలో టికెట్ రేట్లు పెంచామని మిగిలిన ఏరియాలతో పాటూ తెలంగాణ రాష్ట్రంలో మామూలు ధరలతోనే టికెట్లు అందుబాటులో ఉన్నాయని నిర్మాతలు తెలిపారు.
టికెట్ రేట్లు పెరిగిన ఏరియాల్లో కూడా మరీ అంత భారీగా టికెట్ రేట్లు పెరగలేదని, సింగిల్ స్క్రీన్స్ లో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.75 పెంచుకునేందుకు మాత్రమే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని, సినిమా రిలీజైన రోజు నుంచి ఏడు రోజుల పాటూ ఈ టికెట్ రేట్లు అమల్లో ఉంటాయని నిర్మాతలు తెలిపారు. ఇక సినిమా విషయానికొస్తే రాబిన్‌హుడ్ పై ఆల్రెడీ మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాకు నితిన్ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమనిపించేలా రాబిన్‌హుడ్ కు హైప్ వచ్చింది.