Begin typing your search above and press return to search.

రాబిన్ హుడ్.. అనుకున్నట్లే ట్విస్ట్ ఇచ్చిన మైత్రి!

యంగ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ సినిమా "రాబిన్ హుడ్" ఎప్పటి నుంచో ప్రేక్షకులలో అంచనాలు పెంచుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Dec 2024 9:04 AM GMT
రాబిన్ హుడ్.. అనుకున్నట్లే ట్విస్ట్ ఇచ్చిన మైత్రి!
X

యంగ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ సినిమా "రాబిన్ హుడ్" ఎప్పటి నుంచో ప్రేక్షకులలో అంచనాలు పెంచుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మూడు నెలల ముందుగానే ఓ క్లారిటీ ఇచ్చారు. ఇక వాయిదా పడినట్లు ఇటీవల రకాల రూమర్స్ వైరల్ అయ్యాయి. ఇక అనుకున్నట్లే మేకర్స్ రిలీజ్ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు.


మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటనతో ఈ వార్తను ధృవీకరించారు. “అనివార్య కారణాల వల్ల రాబిన్ హుడ్ ఈ నెల 25న విడుదల కావడం లేదు. కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తాం. ఈ ఆలస్యం వెనుక సాంకేతిక కారణాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకులకు మరింత మెరుగైన ఎంటర్‌టైన్‌మెంట్ అందించడమే మా లక్ష్యం” అని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో కొత్త రిలీజ్ డేట్‌ ఎప్పుడు అనేదానిపై అందరి దృష్టి పడింది.

సంక్రాంతి సీజన్‌కు రిలీజ్ చేయాలని కూడా అనుకున్నారు. కానీ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ సినిమాలు రేసులో ఉన్న నేపథ్యంలో అప్పుడు కూడా రిస్క్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. నితిన్ మాత్రం వీలైనంత తొందరగా హాలిడేస్ సీజన్ లో సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాడు. సంక్రాంతి పైన నితిన్ గట్టిగానే హోప్స్ పెట్టుకున్నప్పటికి మేకర్స్ ఆ డేట్ కు కూడా రావద్దని ఫిక్స్ అయ్యారని టాక్.

హీరో నితిన్ కెరీర్ పరంగా ఈ చిత్రం ఎంతో కీలకం. ‘భీష్మ’ తర్వాత నితిన్‌కు సరైన హిట్ లేకపోవడంతో రాబిన్ హుడ్ సినిమా మీద అతను భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇక వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ‘భీష్మ’ బ్లాక్‌బస్టర్ అందుకున్న తర్వాత ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఆలస్యం అవుతోందన్న వార్త కొంత నిరాశను కలిగించినప్పటికీ, సినిమా పట్ల నితిన్, మైత్రి మూవీ మేకర్స్ నమ్మకం చాలా గట్టిగా ఉంది.

ఫైనల్ గా సినిమాను 2025 శివరాత్రి సమయానికి విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ టైమ్ లో పోటీ కూడా ఎక్కువగా ఉండదని మైత్రి వారు ఒక ప్లాన్ తోనే ఉన్నారు. ఇక నితిన్ మాత్రం సంక్రాంతి పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు. మరి న్యూ రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ సినిమాలో శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల వరుసగా స్టార్ హీరోలతో నటిస్తూ టాలీవుడ్‌ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, రాబిన్ హుడ్లో మరోసారి తన గ్లామర్ మరియు డాన్స్‌తో ఆకట్టుకోనున్నట్లు టాక్. ఆమె నటన ఈ సినిమాకు మరో బలంగా నిలుస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.