Begin typing your search above and press return to search.

విభిన్నంగా 'రాబిన్‌హుడ్‌' సెకండ్‌ సింగిల్‌

ఇప్పటికే ఒక పాటను విడుదల చేసిన రాబిన్‌ హుడ్‌ టీం తాజాగా సెకండ్‌ సింగిల్‌ను విడుదల చేశారు. మొదటి పాట మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా సాగింది. రెండో పాటను ప్రయోగాత్మకంగా ప్లాన్‌ చేశారు.

By:  Tupaki Desk   |   14 Feb 2025 2:50 PM GMT
విభిన్నంగా రాబిన్‌హుడ్‌ సెకండ్‌ సింగిల్‌
X

నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో గతంలో వచ్చిన 'భీష్మ' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. దాంతో వీరిద్దరి కాంబోలో ప్రస్తుతం రూపొందుతున్న 'రాబిన్‌హుడ్‌' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా మొదట రష్మిక మందన్న హీరోయిన్‌గా ఎంపిక అయింది. కానీ పుష్ప 2 సినిమా కోసం ఆమె ఎక్కువ డేట్లు కేటాయించాల్సి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాబిన్‌హుడ్‌ సినిమాలో నితిన్‌కు జోడీగా రష్మిక స్థానంలో శ్రీలీలను నటింపజేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అంచనాలు పెంచే విధంగా పాటలను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఒక పాటను విడుదల చేసిన రాబిన్‌ హుడ్‌ టీం తాజాగా సెకండ్‌ సింగిల్‌ను విడుదల చేశారు. మొదటి పాట మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా సాగింది. రెండో పాటను ప్రయోగాత్మకంగా ప్లాన్‌ చేశారు. పాపులర్‌ బ్రాండ్స్‌ను ఉపయోగించి పాటను ట్యూన్‌ చేశారు. లిరిక్స్‌లోనూ బ్రాండ్స్‌ను చెప్పడం ద్వారా వినూత్నంగా సెకండ్‌ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ పాటతో సినిమా స్థాయి మరింతగా పెరుతుంది అనే విశ్వాసంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ఈ పాటను విడుదల చేశారు. గత ఏడాది గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల నటించింది. ఆ సన్నిహిత్యంతోనే శ్రీలీల కోసం రాబిన్‌ హుడ్‌ సినిమాలోని ఈ రెండో పాటను మహేష్ బాబు విడుదల చేసి ఉంటారు అని తెలుస్తోంది. మొత్తానికి సూపర్‌ స్టార్‌ చేతుల మీదుగా పాట రిలీజ్ కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. మహేష్ బాబు సాంగ్‌ అద్భుతంగా ఉందని, తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చే విధంగా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పాటను ఆన్‌ లైన్ ద్వారా విడుదల చేశారు. మహేష్ బాబు ట్వీట్‌ చేయడంతో చాలా తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్‌ను ఈ పాట రాబట్టింది.

ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. రెండో పాట విడుదలకు ముందు వెంకీ కుడుముల, జీవీ ప్రకాష్ కుమార్‌ చేసిన ఒక ఫన్నీ స్కిట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో సినిమాలోని ఈ పాట చాలా స్పెషల్‌గా ఉంటుందని ముందుగానే అనిపించింది. అనిపించినట్లుగానే విభిన్నంగా ఈ పాట సాగింది. ఆకట్టుకునే సంగీతంతో పాటు మంచి సాహిత్యం ఉండటం వల్ల పాటకు విడుదలకు ముందే మంచి స్పందన దక్కే అవకాశం ఉంది. ఈ పాటతో సినిమా జనాల్లోకి ఎక్కువగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మార్చి చివర్లో రాబోతున్న ఈ సినిమా కోసం నితిన్‌ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో నితిన్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. కానీ రాబిన్‌హుడ్‌ పై మాత్రం పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ చేయడంలో మేకర్స్‌ సక్సెస్ అయ్యారు.