నైజాంలో థియేటర్ లైన్ క్లాష్.. మైత్రి సినిమాకు సమస్యలు?
ఈ వారం తెలుగు ప్రేక్షకులను డిఫరెంట్ గా ఎట్రాక్ట్ చేసే సినిమాలు రెడీగా ఉన్నాయి.
By: Tupaki Desk | 26 March 2025 10:41 AMఈ వారం తెలుగు ప్రేక్షకులను డిఫరెంట్ గా ఎట్రాక్ట్ చేసే సినిమాలు రెడీగా ఉన్నాయి. నితిన్ హీరోగా వస్తున్న రాబిన్ హుడ్, సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి మ్యాడ్ స్క్వేర్, అలాగే మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ చిత్రం ఎంపురాన్ (L2E) తెలుగులో రిలీజ్ కానుండడంతో బాక్సాఫీస్ వద్ద క్లాష్ గట్టిగానే ఉండనుంది. ముఖ్యంగా రాబిన్ హుడ్ సినిమా ఈ రేసులో ముందుంది. సినిమాకి చేస్తున్న ప్రమోషన్ మాత్రమే కాకుండా వరుస అప్డేట్స్ కూడా మంచి హైప్ క్రియేట్ చేశాయి.
అయితే, ఈ సినిమా పోటీల కంటే ముందు ఇప్పుడు నైజాంలో థియేటర్ల సమస్య చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి వచ్చే రాబిన్ హుడ్ సినిమాకు హైదరాబాదు సిటీలో సరైన థియేటర్లు దక్కడం లేదనే వార్తలు బయటకు వచ్చాయి. నైజాం ఏరియా అనేది తెలుగులో ఏ సినిమా అయినా వసూళ్ల పరంగా కీలకమైన మార్కెట్. ముఖ్యంగా నితిన్ లాంటి హీరోలకు మంచి బిజినెస్ ఉంది.
అతని ప్రతి సినిమా థియేటర్ల పంపిణీ విషయంలో ముందుగానే ప్లాన్ చేసుకుంటుంది. కానీ ఈసారి మైత్రి సంస్థకు కొన్ని థియేటర్లు దక్కకుండా పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో కొన్ని మల్టీప్లెక్స్‌లు ఇప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో రాబిన్ హుడ్‌కు భారీగా షోలు దక్కలేదని సమాచారం. ఈ నేపథ్యమే మైత్రి సంస్థ చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో కానీ మైత్రి సంస్థకు సిటీ లో తమ సినిమా కోసం స్పేస్ తీసుకోవడం కష్టంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి మైత్రి మూవీ మేకర్స్ గతంలో పెద్ద సినిమాలను రిలీజ్ చేసిన అనుభవం ఉన్న సంస్థ. కానీ ఈసారి సడెన్‌గా నైజాంలోని థియేటర్ డిస్ట్రిబ్యూషన్‌పై సమస్యలు వచ్చాయని తెలుస్తోంది. మరి ఈ సమస్యను మేకర్స్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
ఇప్పటికే హైదరాబాదులో పలు మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు థియేటర్ షేరింగ్‌పై దృష్టి పెట్టగా, రెండు సినిమాలకు థియేటర్లకు మధ్య ప్రాధాన్యతకు సంబంధించి అంతర్గతంగా తేడాలు వస్తున్నాయంటూ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాబిన్ హుడ్ పైన మంచి బజ్ ఉండటంతో, మైత్రి సంస్థ కూడా తమ సినిమాకు మరింతగా స్పేస్ తీసుకోవాలనుకుంటోంది. నితిన్ – వెంకీ కుడుముల కాంబినేషన్‌కు ఓ మంచి క్రేజ్ ఉండడంతో, ఓపెనింగ్ డేను మిస్ చేయకుండా థియేటర్లను బలోపేతం చేసేందుకు మైత్రి సంస్థ అన్ని విధాలా కసరత్తు చేస్తోంది. ఈ రోజు జరిగే కీలక చర్చల తర్వాత రాబిన్ హుడ్‌కు ఏ స్థాయిలో థియేటర్లు దక్కుతాయన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.