Begin typing your search above and press return to search.

సందీప్ ప్లేస్‌లోకి నితిన్?

అలాంటిదేమీ జరగట్లేదంటే ‘మజాకా’ సంక్రాంతికి రావట్లేదని భావించవచ్చు. ఐతే దీని స్థానంలోకి మరో మిడ్ రేంజ్ మూవీ వస్తుందన్నది తాజా కబురు.

By:  Tupaki Desk   |   14 Dec 2024 10:30 PM GMT
సందీప్ ప్లేస్‌లోకి నితిన్?
X

వచ్చే సంక్రాంతికి రానున్న మూడు పెద్ద సినిమాల విషయంలో చాలా ముందుగానే ఒక క్లారిటీ వచ్చేసింది. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’తో పాటు బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ పండుగ రిలీజ్ ఖరారు చేసుకున్నాయి. వీటితో పాటు ఓ చిన్న-మిడ్ రేంజ్ సినిమాను రిలీజ్ చేయడానికి స్కోప్ ఉందని భావిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు నక్కిన రూపొందిస్తున్న ‘మజాకా’ చిత్రం ఆ స్లాట్‌లోకి వస్తుందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ రిలీజ్‌కు ఇంకో నెల మాత్రమే సమయం ఉన్నప్పటికీ ‘మజాకా’ టీం నుంచి సౌండ్ లేదు. సంక్రాంతి రిలీజ్ పక్కా అయితే ఈపాటికే ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ ఉండాలి. సినిమాను వార్తల్లో నిలబెట్టాలి. అలాంటిదేమీ జరగట్లేదంటే ‘మజాకా’ సంక్రాంతికి రావట్లేదని భావించవచ్చు. ఐతే దీని స్థానంలోకి మరో మిడ్ రేంజ్ మూవీ వస్తుందన్నది తాజా కబురు.

నితిన్ సినిమా ‘రాబిన్ హుడ్’ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల తాజా ఆలోచనగా చెబుతున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ మైత్రీ సంస్థ నుంచి వచ్చిన ‘పుష్ప-2’కు లాంగ్ రన్ ఉంటుందని, క్రిస్మస్ సెలవుల్లో కూడా మంచి వసూళ్లు రాబడుతుందని భావిస్తున్న నిర్మాతలు.. దానికి పోటీగా తమ సంస్థ నుంచే మరో సినిమాను రిలీజ్ చేయడం ఎందుకని వెనక్కి తగ్గుతున్నారని చర్చ నడుస్తోంది. హీరో, డైరెక్టర్ క్రిస్మస్ రిలీజ్‌కే పట్టుబడుతున్నప్పటికీ.. అది సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. సంక్రాంతికి రిలీజ్ చేస్తే సినిమాకు ఇంకా మంచి ఫలితం ఉంటుందని నచ్చజెబుతున్నారట. సంక్రాంతికి పోటీ గట్టిగానే ఉన్నప్పటికీ.. తమ చేతిలో పెద్ద సంఖ్యలోనే థియేటర్లు అందుబాటులో ఉండడంతో మంచి రిలీజ్ ఉండేలా చూస్తామని అంటున్నారట. ‘రాబిన్ హుడ్’ సంక్రాంతి రిలీజ్ గురించి త్వరలోనే ప్రకటన రావచ్చని అంటున్నారు.